Chittoor: చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టని కన్నకొడుకు.. కారణం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Son Skips Father’s Last Rites in Chittoor: చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆస్తిపాస్తులేవీ సంపాదించి పెట్టని తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టేందుకు కన్నా కొడుకు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొడుకు స్థానంలో తల కొరివి పెట్టే బాధ్యత కూతురు నెరవేర్చింది. తండ్రి అంత్యక్రియలను కుమార్తె స్వయంగా నిర్వహించిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
చిత్తూరు జిల్లా కార్వేటినగరంకు చెందిన వెంకటేశ్వర్లు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన మృతి చెందారు. సుమారు 15 ఏళ్ల క్రితమే ఆయన భార్య శాంతమ్మ మృతి చెందడంతో.. అప్పటి నుంచి వెంకటేశ్వర్లు ఒంటరిగానే జీవిస్తున్నారు. వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు మురళీకృష్ణ బతుకుదెరువు కోసం చెన్నైలో ఉంటున్నాడు. అయితే తండ్రి అనారోగ్యంతో ఉన్న సమయంలో పెద్ద కుమార్తె నాగరత్నం ఆయన ఆలనాపాలనా చూసుకుంది. నాగరత్నం భర్త కూడా ఇప్పటికే మృతి చెందడంతో.. తండ్రి బాధ్యతను ఆమె తీసుకున్నారు.
Also Read
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
వెంకటేశ్వర్లు మృతి చెందిన విషయాన్ని గ్రామస్తులు, బంధువులు చెన్నైలో ఉన్న కుమారుడు మురళీకృష్ణకు సమాచారం అందించారు. అయితే ఆయన గ్రామానికి రాకపోవడంతో.. తండ్రి అంత్యక్రియలకు కుమారుడు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో చివరకు పెద్ద కుమార్తె నాగరత్నమే తండ్రి అంత్యక్రియలను నిర్వహించారు. కొడుకు చేయాల్సిన తలకొరివి బాధ్యతను కూతురే చేపట్టి తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తండ్రి చివరి ప్రయాణంలో కుమారుడి స్థానంలో కుమార్తె ముందుండి అంత్యక్రియలు చేయడం స్థానికులను కదిలించింది. కన్న కొడుకు చేయాల్సిన అంతిమ సంస్కారాలను కుమార్తె చేయాల్సి రావడం గ్రామంలో తీవ్ర చర్చకు దారితీసింది.
తాజావార్తలు
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?