TTD Hundi Income: శ్రీవారికి కాసుల వర్షం.. హుండీ ఆదాయం సరికొత్త రికార్డు.. మూడేళ్ల తర్వాత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Hundi Income August 18 2026: తిరుమల శ్రీవారి హుండీకి భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో మూడు సంవత్సరాల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రూ.6 కోట్ల మార్క్‌ను దాటింది. మంగళవారం (ఆగష్టు 18) ఒక్కరోజే భక్తులు హుండీలో ఏకంగా రూ.6.12 కోట్లను కానుకలుగా సమర్పించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. భారీగా భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది.
మరోవైపు టీటీడీ చరిత్రలోనే అత్యధిక నెలవారీ హుండీ ఆదాయం 2026 జూలైలో నమోదైంది. ఆ నెలలో శ్రీవారి హుండీ ద్వారా రూ.140.28 కోట్ల ఆదాయం సమకూరింది. జూలైలో దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. మొత్తం 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ భారీగా ఉండటంతో.. హుండీకి కూడా పెద్ద మొత్తంలో కానుకలు వచ్చాయి.
Also Read
ఆగస్టు నెలలోనూ తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోవడంతో.. టోకెన్లు లేని భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. నిన్న (ఆగష్టు 18) శ్రీవారిని మొత్తం 80,905 మంది భక్తులు దర్శించుకున్నారు. దర్శనానికి భారీ సమయం పడుతున్నప్పటికీ.. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ నెలలో భక్తుల సంఖ్య భారీగా ఉండటంతో శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే జూలైలో నెలవారీ హుండీ ఆదాయం రికార్డు సృష్టించగా.. తాజాగా ఒక్కరోజులోనే రూ.6.12 కోట్ల ఆదాయం రావడం శ్రీవారిపై భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?