పోలీసులపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం గుంతపల్లిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై కత్తితో దాడి సందర్భంగా.. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఘాటైన విమర్శలు చేశాడు. రాప్తాడులో ప్రశ్నించినవారిపై దాడులు చేస్తున్న పరిటాల కుటుంబానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. పోలీసులకు సిగ్గుండాలని, పోలీసులు పరిటాల కుటుంబం గుమస్తాలు, వాచ్‌మెన్‌లు కాదని విమర్శించారు.
Thopudurthi Prakash Reddy: టీడీపీ నేతలకు రాప్తాడు ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సవాల్ చేశారు. తనపై ఐ-టీడీపీ, చైతన్య రథం అనే ఈ పేపర్ ద్వారా గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను హత్యలు చేయించానని రాశారని.. దీనిపై సీఐడీ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై డీఐజీకి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. రాజారాం, ఈశ్వరయ్య అనే వ్యక్తులను తాను చంపానని రాశారని.. కానీ వారు బ్రతికే ఉన్నారని తోపుదుర్తి…