Virat Kohli-PV Sindhu: విరాట్ కోహ్లీ నా ‘బ్రదర్’.. పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఉన్న ప్రత్యేక అనుబంధంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. విరాట్ కోహ్లీని తాను సొంత సోదరుడిగా భావిస్తానని, కెరీర్‌లోని కష్టకాలంలో ఆయన ఇచ్చిన సలహా తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసిందని వెల్లడించారు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సింధు, విరాట్‌తో ఉన్న సాన్నిహిత్యం , మైదానంలో ఆయన ప్రదర్శించే పట్టుదలపై ప్రశంసల వర్షం కురిపించారు.
కెరీర్లో తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో ఒకసారి విరాట్ కోహ్లీని కలిసినట్లు సింధు గుర్తుచేసుకున్నారు. ఏదీ కలసిరావడం లేదని తాను చెప్పినప్పుడు, “ఏదీ ఆలోచించకుండా కేవలం మైదానంలోకి అడుగుపెట్టు. నీవు ఏమిటో, నీ కష్టం ఏమిటో నీకు తెలుసు. ఎలాంటి భయం లేకుండా నీ సహజ సిద్ధమైన ఆటను ఆడు. పోయేదేమీ లేదు, నువ్వేంటో ప్రపంచానికి చూపించు” అని విరాట్ ధైర్యం చెప్పినట్లు తెలిపారు. ఆ ఒక్క మాట తనలో సరికొత్త దృక్పథాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపిందని పేర్కొన్నారు.
Also Read
అత్యున్నత స్థాయికి ఎదిగిన క్రీడాకారుడి నుంచి ఇలాంటి ప్రోత్సాహం లభించడం గొప్ప విషయమని, తానేదైనా టోర్నీ గెలిచినప్పుడు ఆ సంతోషాన్ని విరాట్‌తో పంచుకుంటానని సింధు చెప్పారు. ఎంత సాధించినా విరాట్ ప్రదర్శించే క్రమశిక్షణ, నిబద్ధత ఇతరులకు ఎంతో స్పూర్తిదాయకమని కొనియాడారు.
ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ (BWF) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఐదుసార్లు పతక విజేతగా నిలిచిన పీవీ సింధు శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబుల్‌పై 21-7, 21-11 తేడాతో విజయం సాధించి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లారు. మైదానంలో నిలకడగా రాణిస్తూనే, విరాట్ లాంటి అగ్రశ్రేణి అథ్లెట్ల అనుభవాలను స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నానని సింధు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!