Film Federation Council: నేడు ఫిల్మ్ ఫెడరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం… కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Film Federation Council: తెలుగు సినీ పరిశ్రమలో డాన్సర్స్ అసోసియేషన్ వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ నేడు అత్యవసరంగా సమావేశం కానుంది. డాన్సర్స్ అసోసియేషన్ మినహా మిగతా 23 క్రాఫ్ట్స్‌కు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిల్మ్ ఫెడరేషన్, డాన్సర్స్ అసోసియేషన్ మధ్య నెలకొన్న విభేదాలే ఈ అత్యవసర సమావేశానికి ప్రధాన కారణంగా మారాయి. ఇప్పటికే డాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేస్తున్న నేపథ్యంలో, నేటి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా డాన్సర్స్ అసోసియేషన్‌లో జరిగిన ఉపఎన్నికల వ్యవహారంపై ఫెడరేషన్ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ పెద్దలు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఫెడరేషన్ సూచనలు చేసినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఉపఎన్నికలు నిర్వహించారని డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే సుమలత ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఫిల్మ్ ఫెడరేషన్ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆమె వ్యవహార శైలిపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. దీంతో ఈ వివాదం ఇప్పుడు కేవలం డాన్సర్స్ అసోసియేషన్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోని పలు విభాగాల మధ్య చర్చకు దారితీసింది.
Also Read
- The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
- Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
మరోవైపు డాన్సర్స్ అసోసియేషన్ వివాదం క్రమంగా జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్‌గా మారిందనే చర్చ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. అసోసియేషన్‌లోని అంతర్గత పరిణామాలు, ఎన్నికల వ్యవహారాలు, నాయకత్వ నిర్ణయాలు వంటి అంశాలు వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. నేటి జనరల్ కౌన్సిల్ సమావేశంలో డాన్సర్స్ అసోసియేషన్‌పై ఫెడరేషన్ తీసుకోబోయే తదుపరి చర్యలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. సహాయ నిరాకరణ కొనసాగించాలా, వివాదాన్ని పరిష్కరించేందుకు ఎలాంటి మార్గాన్ని అనుసరించాలి, అసోసియేషన్ నాయకత్వంతో ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ వ్యవహారం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారడంతో, ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. 23 క్రాఫ్ట్స్ ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో డాన్సర్స్ అసోసియేషన్‌తో పాటు మొత్తం సినీ పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
- Tags
- cinema
- Film Federation
తాజావార్తలు
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!