YB Rajendra Prasad: 5వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ వెంటనే నియమించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో స్థానిక సంస్థల నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ మండిపడుతోంది. 4 వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ రిపోర్ట్ ను వెంటనే ఆమోదించి అమలు చేయాలని ఛాంబర్ అధ్యక్షులు యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ ఆలస్యం వలన గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ లు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ విమర్శించారు.
73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టాలలోని ఆర్టికల్ 243 లో పేర్కొన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 5 వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ ఏర్పాటు చేసి దాని ప్రకారం స్థానిక ప్రభుత్వాలయిన గ్రామ పంచాయతీలకు, మండల, జిల్లా పరిషత్ లకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు రాష్ట్రప్రభుత్వం ఇవ్వవలసిన వాటా నిధులను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 4 వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ నివేదికను శాసనసభ, శాసన మండలి ముందు ఉంచి వెంటనే ఆమోదించి దానిని అమలు పరిచి దాని ప్రకారం మా స్థానిక ప్రభుత్వాలకు వాటా నిధులను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు చేదువార్త.. అంతా ‘బింబిసార’ వలనే..?
ఈ 4, 5 వ రాష్ట్ర ఆర్థిక సంఘాల ఏర్పాటులో, అమలులో రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేస్తున్న జాప్యం వలన మా స్థానిక ప్రభుత్వాలు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ను అమలు చేయకపోవడం, నియమించ కపోవడం 73 వ రాజ్యాంగ సవరణ చట్టం లోని ఆర్టికల్ 243 కు వ్యతిరేకం. ఇది రాజ్యాంగ విరుద్ధం. మా స్థానిక ప్రభుత్వాలకు నిధులు ఎగ్గొట్టడం కోసమే కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలా దురుద్దేశంతో రాష్ట్ర ఆర్థిక సంఘాల సిఫార్సులను అమలు చేయడం లేదు.
గత 3 వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఇవ్వవలసిన 2019 నుంచి 2022 వరకు సుమారు రూ,, 4000 కోట్ల రూపాయలను మా గ్రామ పంచాయతీలకు, మండల, జిల్లా పరిషత్ లకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎగకోట్టింది. వెంటనే ఆ 4 సంవత్సరాలకు చెందిన సుమారు రూ,, 4000 వేల కోట్లు మా స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు రాజేంద్ర ప్రసాద్.
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంఘాలను ఏర్పాటు చేసి, అమలు చేయకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం 15 వ కేంద్ర ఆర్థిక సంఘం నిధులను 2021- 22 సం,, లకు చెందిన రెండో క్వార్టర్ నిధులు 969 కోట్లు మరియు 2022- 23 సం,, లకు చెందిన రూ,, 2020 కోట్ల నిధులను మా స్థానిక సంస్థలకు విడుదల చేయకుండా ఆపి వేసినది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంఘం ను ఏర్పాటు చేసి అమలు చేస్తేనే కేంద్ర ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వంలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లో చలనం లేకపోవడం సిగ్గుచేటైన విషయం అని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా మా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకునిధులు విడుదల చేయకపోవడం వలన కేంద్ర ఆర్థిక సంఘం నిధులు దారి మళ్ళించడం వలన మా గ్రామీణ,పట్టణ ప్రజలకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు కల్పించలేక సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉత్సవ విగ్రహాలు లాగా మిగిలిపోయి ప్రజల చేత నిందించ బడుతున్నారు.వెంటనే 4 వ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేసి, 5 వ రాష్ట్ర ఆర్థిక సంఘం ను ఏర్పాటు చేసి వాటి ప్రకారం మా స్థానిక ప్రభుత్వాలకు నిధులను గత 4 సం,,లవి చెందిన బకాయిల నిధులు సుమారు రూ,, 4000 కోట్లను వెంటనే విడుదల చేసి, కేంద్ర నుంచి రావాల్సిన 15 వ ఆర్థిక సంఘం నిధుల బకాయిలు మొత్తం రూ,, 2989 కోట్లను కేంద్ర ప్రభుత్వం నుంచి రప్పించి మా స్థానిక ప్రభుత్వాలకు తక్షణమే ఆ నిధులను ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైబీ రాజేంద్రప్రసాద్. ఈమేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!