What’s Today:
* నేడు యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. నేడు యాదాద్రి ఆలయంలో సుప్రభాతం, ఆర్జిత సేవలు రద్దు.. మధ్యాహ్నం వరకు సాధారణ దర్శనాలు నిలిపివేత
* నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. నర్సీపట్నం నియోజకవర్గంలో రెండు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. సుమారు వెయ్యి కోట్లతో మెడికల్ కాలేజ్, ఏలేరు-తాండవ ఎత్తిపోతల పథకాలు చేపట్టిన ప్రభుత్వం.. అనంతరం జోగునాథుని పాలెం బహిరంగ సభ
* హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టు కేసులో నేడు బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్న రామచంద్రభారతి
* అమరావతి: నేడు హైకోర్టులో మాచర్ల టీడీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ
* ప్రకాశం: నేడు మార్కాపురం మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్
* నేడు గుంటూరు భాస్కర్ థియేటర్‌లో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలోని నాలుగో పాట విడుదల కార్యక్రమం
* ఏలూరు జిల్లా: నేడు పోలవరంలో రెండో రోజు పీపీఏ బృందం పర్యటన.. పునరావాస కాలనీల పరిశీలన
* నేడు భద్రాచలం రామాలయంలో ముక్కోటి అధ్యయనోత్సవాలు.. బలరాం అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న రామచంద్రస్వామి