What’s Today:
• నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం జగన్ పర్యటన.. జగనన్న విద్యాదీవెన 4వ విడత నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేయనున్న సీఎం.. టిప్పు సుల్తాన్ మైదానంలో బహిరంగసభలో పాల్గొననున్న జగన్
• నేటి నుంచి ప.గో. జిల్లాలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన
• తిరుమల: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. ఆనంద నిలయానికి బంగారు తాపడం, వైకుంఠ ద్వారదర్శనంపై నిర్ణయాలు తీసుకోనున్న పాలకమండలి
• ఏపీ నూతన సీఎస్‌గా నేడు బాధ్యతలు స్వీకరించనున్న జవహర్‌రెడ్డి
• కాకినాడ: నేడు సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
• తూర్పుగోదావరి: నేడు రెండో రోజు రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో జగనన్న స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలు.. పాల్గొననున్న మంత్రి ఆర్.కె రోజా
• నేడు మూడో రోజు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర.. గుండెగావ్, మహాగావ్ మీదుగా బండి సంజయ్ పాదయాత్ర
• నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన.. దుబ్బాకలో టీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం.. దుబ్బాక నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటైన అక్బర్ పేట-భూంపల్లి మండల రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించనున్న మంత్రి హరీష్‌రావు
• నేడు భారత్-న్యూజిలాండ్ మూడో వన్డే.. ఉదయం 7 గంటలకు మ్యాచ్
• ఫిఫా ప్రపంచకప్ 2022: నేడు డెన్మార్క్ వర్సెస్ ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వర్సెస్ ట్యునీషియా