What’s Today:
• ఢిల్లీ: నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. పోటీ పడుతున్న మల్లికార్జున ఖర్గే, శశిథరూర్.. అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.. ఎల్లుండి ఓట్ల లెక్కింపు
• నేడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు బ్రేక్.. ఈనెల 18 నుంచి 21 వరకు ఏపీలో రాహుల్ పాదయాత్ర.. 22న తిరిగి కర్ణాటకలోని రాయచూర్‌లో ప్రవేశించనున్న భారత్ జోడో యాత్ర
• నేడు నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్
• నేడు సాయంత్రం మునుగోడు వెళ్లనున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. రేపు ఎన్నికల ప్రచారం, రోడ్ షోలలో పాల్గొననున్న బండి సంజయ్
• పల్నాడు జిల్లా: చిలకలూరిపేట మండలం గోవిందపురం గ్రామంలో నేడు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి విడదల రజినీ
• టీ20 ప్రపంచకప్: నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య వార్మప్ మ్యాచ్.. ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్
• టీ20 ప్రపంచకప్: నేడు వెస్టిండీస్, స్కాట్లాండ్ మధ్య క్వాలిఫైయర్ మ్యాచ్.. ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. ఐర్లాండ్, జింబాబ్వే మధ్య క్వాలిఫైయర్ మ్యాచ్.. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్