* సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3గంటలకి మంత్రివర్గ సమావేశం.. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. అమరావతి ఎస్పీవీకి ఆమోదం తెలపనున్న మంత్రివర్గం.. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును, తాడిగడప పురపాలక సంఘంగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం..
* నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం 9 గంటలకు శాసన సభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు.. మొదటి రోజు ప్రశ్నోత్తరాలతో సమావేశాలు ప్రారంభం.. అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత బీఏసీ సమావేశం.. సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగించాలనే అంశంపై బీఏసీలో చర్చ..
* నేడు వైసీపీ శాసన సభా పక్ష సమావేశం.. తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశం.. పాల్గొననున్న వైసీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..
* నేడు ఏసీబీ కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై విచారణ.. ఎంపీ మిథున్ రెడ్డిని 5 రోజుల కస్టడీకి కోరుతూ సిట్ పిటిషన్.. లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి..
* నేడు కూడా స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ఓపీడీ సేవలు బంద్.. బకాయిల చెల్లింపుపై సీఎం, మంత్రుల నుంచి వాగ్దానం ఇవ్వాలని డిమాండ్.. రూ. 3,800 కోట్ల మేర బకాయిలు ఉన్నాయంటున్న స్పెషాలిటీ ఆస్పత్రులు..
* నేడు డిసెంబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఇవాళ్టి నుంచి 24 వరకు ఆన్ లైన్ లో దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఇవాళ లక్కీడీఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలు, అంగప్రదక్షణ టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ..
* నేటి నుంచి హైదరాబాద్ లో అఖిల భారత ఉద్యాన ప్రదర్శన.. ఈ నెల 22 వరకు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులతో ప్రదర్శన..
* నేటి ఉదయం 10 గంటలకి రాహుల్ గాంధీ ప్రెస్ మీట్.. ఓట్ల చోరీ విషయంలో హైడ్రోజన్ బాంబు పెలుస్తానంటూ వెల్లడి.. ఇవాళ్టి రాహుల్ ప్రెస్ మీట్ పై సర్వత్రా ఉత్కంఠ..
* నేడు ఆసియా కప్ లో శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్.. అబుదాబి వేదికగా రాత్రి 8గంటలకి మ్యాచ్..