* నేడు హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల వేడుకలు.. లాల్ దర్యాజ మహంకాళి ఆలయంలో భారీ ఏర్పాట్లు.. అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్న మంత్రులు.. 2500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు.. బోనాలు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
* నేడు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకానున్న విడదల రజినీ.. జగన్ రెంటపాళ్ల పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారంటూ నమోదైన కేసులో విచారణ..
* నేడు ఏపీలోని 12 జిల్లాలకు వర్షాలు.. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం..
* తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు..
* నేడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. కంపార్ట్మెంట్లన్నీ నిండి.. వెలుపల క్యూలైన్ల వరకు వేచి ఉన్న భక్తులు..
* నేడు పార్లమెంట్ ఉభయసభల్లో అన్ని పక్షాల నేతల సమావేశం.. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు ఆధ్వర్యంలో సమావేశం.. పార్లమెంట్ అనుబంధ భవనంలో ఉదయం 11 గంటలకు సమావేశం..
* నేడు లెజెండ్స్ టీ20 టోర్నీలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. రాత్రి 9 గంటలకు జరగనున్న మ్యాచ్.. పాక్ తో మ్యాచ్ కు దూరంగా హర్భజన్, యూసుఫ్ పఠాన్..