గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కోడిపందాలు. పందాల్లో గెలిచిన ఓడిన కోడిపుంజుకున్నా డిమాండే వేరు. ఓడిపోయిన కోడి కోస మాంసం తినడానికి ఎవరైనా లొట్టలు వేయాల్సిందే. డ్రై ఫ్రూట్స్ మేతగా వేసి కోడిపుంజులను పెంచుతారు.. గనుక వీటి మాంసం టేస్టే వేరు.. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చే బంధువులకు, కొత్త అల్లుళ్లుకు కోస టేస్ట్ కు లొట్టలేస్తారు.
పండగ వేళ పల్లెలు.. కిక్కిరిసిన జనంతో కొత్త కళను సంతరించుకుంటున్నాయి... ఇక కోడి పందేల్లో కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ వంటి జాతి కోళ్లు కత్తికట్టి కాలు దువ్వుతున్నాయి. వీటి హవానే ఇన్నేళ్ల నుంచీ పందేల్లో కొనసాగుతుంది. ఈ సారి కూడా ఈ జాతి కోళ్లదే హవా నడుస్తోందని చెబుతున్నారు పందేం రాయుళ్లు. ఇక ఒక్కో పందెం వేల నుంచి లక్షల రూపాయల్లోకి వెళ్లిపోయింది.