YS Jagan: డయేరియా మృతుల కుటుంబాలకు పరామర్శ.. ఆర్థిక సాయం ప్రకటించిన జగన్
- విజయనగరం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
- గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలకు పరామర్శ..
- డయేరియా మృతుల కుటుంబాలకు రూ 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటన..
- కూటమి హయాంలో గ్రామ స్వరాజ్యం అస్తవ్యస్తం అయ్యిందన్న మాజీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: విజయనగరం జిల్లా పర్యటనలో ప్రభుత్వంపై హాట్ కామెంట్లు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను.. డయేరియాతో ఆస్పత్రిపాలైనవారిని పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా డయేరియా మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు.. కూటమి హయాంలో గ్రామ స్వరాజ్యం అస్తవ్యస్తం అయ్యింది.. 14 మంది డయేరియాతో చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు.. సెప్టెంబర్ లో మొదటి కేసు నమోదైనా 35 రోజులపాటు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.. గుర్ల, ఘోషాడలో తీవ్రంగా డయేరియా ప్రబలింది.. గుర్ల గ్రామాల్లో డయేరియాతో నేను ట్వీట్ చేస్తేనే ప్రభుత్వం స్పందించిందన్నారు..
Read Also: Madhabi Puri Buch: పార్లమెంటరీ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టిన సెబీ చీఫ్
Also Read
- CM Chandrababu: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్‌ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
- Deputy CM Pawan Kalyan: మోడీని మించిన నాయకుడు లేరు.. భోగాపురం సభలో పవన్ భావోద్వేగ ప్రసంగం
- Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. 'ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్‌పోర్టు వచ్చింది'
ఇక, వ్యాధి తీవ్రతను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు.. చంపావతి నదిలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.. మెయింటెనెన్స్ రెన్యువల్ కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు.. క్లోరినేషన్ జరిగిందో లేదో కూడా పట్టించుకోలేదు అని మండిపడ్డారు వైఎస్ జగన్.. సచివాలయ సహాయ సహకారాలు తీసుకోవాలనే ఆలోచనే లేదు.. శానిటేషన్ పట్టించుకోలేదు.. 345 మంది డయేరియాతో ప్రభుత్వ ఆసుపత్రిలో, 100 మందికి పైగా ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు.. ఇష్యూ ని కవర్ చేసుకోవాలనే దిక్కుమాలిన ఆలోచనలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.. మండలంలో 14 మంది చనిపోతే కనీసం విశాఖ కేజీహెచ్ కి తీసుకెళ్లలేకపోయారంటూ ప్రశ్నించిన జగన్.. గ్రామీణ ప్రజల పట్ల ప్రభుత్వం అశ్రద్ధగా ఉందన్నారు..
Read Also: MLC Jeevan Reddy: అవమానంగా భావిస్తున్న.. ఖర్గే, రాహుల్ గాంధీ లకు జీవన్ రెడ్డి లేఖ..
మేము అభివృద్ధి చేసిన స్కూల్లోనే వైద్యం అందించాడు.. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరం ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేకపోయారు? అని ప్రశ్నించారు జగన్.. ప్రభుత్వం నుండి సహాయం చేయకపోగా, డయేరియా వలన చనిపోయినట్లు చెప్పొద్దంటూ బాధిత కుటుంబాలకు అధికారులు చెప్పడం దారుణం అన్నారు.. ఆరోగ్య శ్రీ బకాయిలను కూడా ఈ ప్రభుత్వం చెల్లించలేకపోతుంది.. నిర్మాణంలో ఉన్న 12 మెడికల్ కాలేజీలను అమ్మేయడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.. ఆరోగ్యశ్రీ లో 25 లక్షలు వరకు ఉచిత వైద్యము అందించాం.. దానిని కూడా ప్రస్తుత ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. 65 మంది ఇప్పటికే చికిత్స పొందుతున్నారు.. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. డయేరియా మృతుల కుటుంబాలకు రెండు లక్షలు పరిహారం అందజేస్తున్నాం.. ఏదైనా ఇష్యూ జరిగితే డైవర్షన్ ఎలా చేయాలో చూస్తున్నారు తప్పా పని చేయరు అని దుయ్యబట్టారు వైఎస్ జగన్..
తాజావార్తలు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!