Deputy CM Pawan Kalyan: మోడీని మించిన నాయకుడు లేరు.. భోగాపురం సభలో పవన్ భావోద్వేగ ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని వికసిత్ భారత్ దిశగా ముందుకు నడిపిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యా్ణ్ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, మోడీ దేశం కోసం చేస్తున్న కృషి కొత్త తరానికి పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. జంతర్‌మంతర్‌లో ప్రధానిని అనుచిత పదజాలంతో విమర్శించిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ తెలిపారు. ప్రధాని మోడీపై ఎవరైనా విమర్శలు చేస్తే, అది తమందరిపైనా చేసినట్లేనని వ్యాఖ్యానించారు. నేటి యువతకు దేశ నాయకుల పట్ల గౌరవం, సరైన సంస్కారం నేర్పాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశానికి సేవ చేయడంలో ప్రధాని మోడీ ఎలాంటి సెలవులు తీసుకోకుండా నిరంతరం శ్రమిస్తున్న మహానేత అని పవన్ కల్యాణ్ కొనియాడారు. దేశాన్ని నడిపించడం రామకార్యంలాంటిదని, అలాంటి గొప్ప బాధ్యతను మోడీ సమర్థంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. దేశం కోసం అంకితభావంతో పనిచేస్తున్న నాయకుడికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇక, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్న పవన్, ఒకప్పుడు “ఎర్రబస్సు కూడా రాదు” అని విమర్శించిన ప్రాంతంలో నేడు అంతర్జాతీయ విమానాశ్రయం రావడం అభివృద్ధికి నిదర్శనమన్నారు. ప్రధాని మోడీని మించిన నాయకుడు మరొకరు లేరని, భవిష్యత్తులో కూడా అలాంటి నాయకత్వం అరుదేనని వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Also Read
- Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
- CM Chandrababu: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
తాజావార్తలు
-
Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
-
Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
-
Shivaji: “ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా”.. ‘ఎపిక్’ ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
-
Liquor Tenders: ఏపీలో మద్యం టెండర్లు.. ఎంఆర్పీ ధరలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
-
Naga Vamsi : ట్రైలర్లో ఆనంద్ ముద్దు సీన్.. ’90స్’ డైరెక్టర్‌పై ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాగవంశీ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!