విజయనగరం జిల్లా పర్యటనలో ప్రభుత్వంపై హాట్ కామెంట్లు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను.. డయేరియాతో ఆస్పత్రిపాలైనవారిని పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా డయేరియా మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు.. కూటమి హయాంలో గ్రామ స్వరాజ్యం అస్తవ్యస్తం అయ్యింది.. 14 మంది డయేరియాతో చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు..