Pydithalli Ammavaru Sirimanotsavam 2024: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు అధికారులు.. నేడు సిరిమానోత్సవం జరగనున్న నేపథ్యంలో.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.. పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు భక్తులు.. మరోవైపు.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా క్యూలైన్లో టెంట్లు ఏర్పాటు చేశారు.. భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు.. హుక్కుం పేటలో సిరిమానుకు పసుపు కుంకాలు సమర్పించుకుంటున్నారు భక్తులు..
Read Also: Asia Cup 2024: అక్టోబర్ 19న భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా తిలక్ వర్మ!
పైడితల్లి అమ్మావారి సిరిమానోత్సవ సందర్భంగా నగరపాలక సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.. నగరపాలిక పరిధిలో 120 వరకు బయో మరుగుదొడ్లు సిద్ధం చేసింది.. ఉత్సవాలు జరిగే వేదికలతో పాటు జాతరకు సంబంధించిన ప్రధాన కేంద్రాల వద్ద టాయిలెట్లను అందుబాటులో ఉంచారు అధికారులు.. పారిశుద్ధ్య పనులకు అదనంగా 330 మందిని నియమించారు.. వీరంతా మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు.. ఆలయం చుట్టూ.. సిరిమాను తిరిగే ప్రాంతంలో 620 మంది ప్రత్యక్షంగా పనులు చేయనున్నారు.. విక, విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి జాతర నేపథ్యంలో నేడు నగరంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి..
Read Also: Pushpa 2 : పుష్ప 2 చూశా…అబ్బా ఏం యాక్షన్.. అవార్డులన్నీ అల్లు అర్జున్ కే : నిర్మాత ఎస్ కేఎన్
ఇక, పైడితల్లి అమ్మా వారి సిరిమానోత్సవానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.. 80 సీసీ కెమెరాలు బిగించారు.. అంతేకాకుండా బందోబస్తులో ఉన్న పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలు ఇచ్చారు.. ఇద్దరు అదనపు ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 61 మంది సీఐలు, ఆస్ఐలు, 147 మంది ఎస్సైలు, ఆర్ఎస్ఐలు.. 17 మంది మహిళా ఎస్సైలు, 425 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 136 మంది మహిళా కానిస్టేబుళ్లు, 369 మంది హోంగార్డులు, 200 మంది ఏఆర్ సిబ్బందిని బందోబస్తు కోసం నియమించింది ప్రభుత్వం.. జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి పోలీసులను రప్పించారు.