Janasena Party: మంత్రులపై దాడి కేసు.. 61 మంది జనసేన నేతలకు బెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena Party: విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడి కేసులో అరెస్ట్ చేసిన జనసేన కార్యకర్తలను ఆదివారం రాత్రి జిల్లా కోర్టు జడ్జి ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు అరెస్ట్ అయిన వారిలో 61 మంది జనసేన నాయకులకు రూ.10వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. మరో 9 మంది నేతలకు ఈనెల 28 వరకు రిమాండ్ విధించింది. అరెస్ట్ అయిన నేతలందరూ బెయిల్‌పై విడుదలయ్యే వరకు తాను విశాఖలోనే ఉంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నోవాటెల్ హోటల్‌లోనే పవన్, నాగబాబు, నాదెండ్ల మనోహర్ బస చేస్తున్నారు.
Read Also: Pawan Kalyan Live: పవన్ కోసం రాత్రంతా ఫ్యాన్స్ పడిగాపులు
Also Read
- Nadendla Manohar: డీఎస్సీపై అవకతవకలు జరిగితే అసెంబ్లీ ధైర్యంగా మాట్లాడండి..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ కసరత్తు.. అభ్యర్థుల ఖరారుపై మాజీ సీఎం జగన్ కీలక సూచనలు..
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
కాగా విశాఖ ఘటనకు సంబంధించి తమ జనసైనికులు 92 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి 70 మందిని అరెస్ట్ చేసినట్టు జనసేన లీగల్ సెల్ పేర్కొంది. వీరిలో 61 మందికి బెయిల్ లభించిందని, 9 మందికి కోర్టు రిమాండ్ విధించిందని తెలిపింది. మిగిలిన వారి బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. అరెస్ట్ అయిన నేతలు, కార్యకర్తలకు అండగా ఉండాలని పవన్ నిర్ణయించారు. మరోవైపు విశాఖ నగరంలో హైటెన్షన్ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ బసచేస్తున్న నోవాటెల్ హోటల్ పోలీసుల ఆధీనంలో ఉంది. హోటల్ వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. హోటల్‌కు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. కాగా పవన్‌తో పోలీస్ అధికారులు పలుమార్లు సమావేశమయ్యారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
-
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
-
Harish Rao : హరీశ్ వర్సెస్ కాంగ్రెస్.. ఇక కోర్టులోనే.!
-
SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!