YS.Jagan: కూటమి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది.. విశాఖ మేయర్ అంశంపై జగన్ ధ్వజం
- ఏపీలో కూటమి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది
- విశాఖ మేయర్ అంశంపై జగన్ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్.జగన్ ధ్వజమెత్తారు. విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానంపై ఎక్స్ ట్విట్టర్ వేదికగా జగన్ స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ గూండాయిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్ పదవి నుంచి బీసీ మహిళను దించేయడం.. కూటమి సర్కార్ చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం అని పేర్కొన్నారు.
ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖ కార్పొరేషన్లో 58 స్థానాలను వైసీపీ గెలిచిందని గుర్తుచేశారు. టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచిందన్నారు. ఈ లెక్కల ప్రకారం మేయర్ పదవి కూటమి ప్రభుత్వానికి ఎలా వస్తుందని ప్రశ్నించారు. బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవ కులానికి చెందిన మహిళను మేయర్ సీటులో కూర్చోబెడితే కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి మేయర్ పదవిని లాక్కున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా ఇది? అని ప్రశ్నించారు.
Also Read
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
.@ncbn గారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.
ప్రజలు ఇచ్చిన…
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2025
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!