గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం చుట్టూ రాజకీయం రసకందాయంలో పడింది. అవిశ్వాసం నెగ్గితే మేయర్, డిప్యూటీ మేయర్ పంపకాలపై కూటమిలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. డిప్యూటీ మేయర్ పై క్లారిటీ రాకుండా క్యాంప్ రాజకీయాలకు వెళ్లలేమని జనసేనలో సగం మంది కార్పొరేటర్లు తేల్చేశారు.