Tollywood : టాలీవుడ్ లోకి బాలీవుడ్ భామలు ఎంట్రీ ఇస్తున్నారు. ఇదేం కొత్త కాదు కదా అనిపించొచ్చు. కానీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడే పనిగట్టకుని మరీ బాలీవుడ్ హీరోయిన్లు వస్తున్నారు. ఒకప్పుడు వచ్చినా చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ లోని ఏ పాన్ ఇండియా సినిమా అయినా సరే బాలీవుడ్ హీరోయిన్లదే హవా కనిపిస్తోంది. వారికే ఛాన్సులు దక్కుతున్నాయి. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించిన సౌత్ హీరోయిన్లపై ఎఫెక్ట పడుతోంది. త్రిబుల్ ఆర్ సినిమాలో ఆలియా భట్ నటించింది. దేవర సినిమాలో జాన్వీకపూర్, రామ్ చరణ్ పెద్ది మూవీలో జాన్వీనే నటిస్తోంది. ఇటు అల్లు అర్జున్-అట్లీ సినిమాలో కూడా జాన్వీతో పాటు దిశాపటానీ ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం.
Read Also : Vijay Sethupathi: అందుకే పూరీ సినిమా ఒప్పుకున్నా!
ప్రభాస్ నుంచి వచ్చిన కల్కి మూవీలో దిశాపటానీ, దీపికా పదుకొణె నటించారు. రెండో పార్టులో కూడా వారే ఉంటారు. ఫౌజీ మూవీలో వేరే భామ నటిస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ కే ఛాన్స్ ఇస్తున్నట్టు సమాచారం. జక్కన్న, మహేశ్ మూవీలో ప్రియాంక చొప్రానే కనిపిస్తోంది. దీంతో సౌత్ హీరోయిన్లకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలే దక్కట్లేదు. అంతకు ముందు తమిళ, కన్నడ, మళయాల భామలదే తెలుగులో హవా కనిపించేది. కానీ ఇప్పుడంతా బాలీవుడ్ హీరోయిన్లదే పైచేయి.
పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాతనే బాలీవుడ్ భామలను ఏరికోరి మరీ మన తెలుగు సినిమాల్లో పెట్టేస్తున్నారు. దానికి మార్కెట్ పరమైన కారణాలు ఉన్నాయి. బాలీవుడ్ హీరోయిన్లు అయితే హిందీ మార్కెట్ లో ఆటోమేటిక్ గా క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు డైరెక్టర్లు. అందుకే వాళ్లకు జై కొడుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఏ పాన్ ఇండియా సినిమా వస్తున్నా సరే బాలీవుడ్ భామలు ఎగరేసుకుపోతున్నారు. రాను రాను ఇలాగే జరిగితే సౌత్ భామలు టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలపై ఆశలు వదులుకోవాల్సిందేనేమో.