విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరోసారి సమ్మె సైరన్ మోగింది.. రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నారు.. తొలగించిన ఉద్యోగులను తక్షణం విధుల్లో చేర్చుకోవాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ సమ్మెకు పిలుపునిచ్చారు కాంట్రాక్ట్ కార్మికులు.. మొత్తంగా రేపటి నుంచి సమ్మెకు వెళ్లనున్నారు 14 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు.. దీంతో, అప్రమత్తమైన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టింది.. ఈ నేపథ్యంలో రెగ్యులర్ ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది..