ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు, మన్యం., ఏలూరు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో మరికొన్ని రోజులు మోస్తరు వానలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చ రికల కేంద్రం వెల్లడించింది. ఇక, దక్షిణ ఝార్ఖండ్ మీద అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతోంది.