Varudu Kalyani: చంద్రబాబు ద్రోహం చేస్తే.. జగన్ రాజకీయ హక్కులు కల్పించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varudu Kalyani Fires On Chandrababu Naidu: బీసీలకు చంద్రబాబు ద్రోహం చేశారని, కానీ సీఎం జగన్ మాత్రం రాజకీయ హక్కులు కల్పించారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి వ్యాఖ్యానించారు. జగన్ సామాన్యులకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. ఒక బీసీ మహిళగా జగన్ దగ్గర పని చెయ్యడం గర్వంగా ఉందన్నారు. బీసీలు జగన్‌కి వెన్నముకగా ఉన్నారన్నారు. బడుగు బలహీన వర్గాలు తమ గొంతు వినిపించే రోజులు త్వరలోనే రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీ, ఎస్టీ, ఎస్సీలకు చట్టసభల్లో మాట్లాడే అవకాశం జగన్ కల్పించారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉనప్పుడు మత్స్యకారులకు అన్యాయం చేశారని.. కానీ జగన్ మంత్రి పదవి ఇచ్చి గౌరవించారని అన్నారు.
Allari Naresh: పోలిసోడి ఫ్యామిలీని టచ్ చేస్తే ఆ మాత్రం వయోలెన్స్ ఉండాలి…
Also Read
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
11 మంది బీసీలకి జగన్ మంత్రి పదవులు ఇచ్చారని.. శాసనసభలో స్పీకర్ పదవి కూడా బీసీ నాయకులకే ఇచ్చారని కల్యాణి పేర్కొన్నారు. జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు సామాజిక న్యాయపాలన చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ పదవులు కూడా చంద్రబాబు హయాంలో డబ్బున్న అగ్రవర్ణాల వరకే ఇచ్చారని ఆరోపణలు చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో చాలావరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్లకే అవకాశాలిచ్చారని చెప్పారు. వెనుకబడిన వర్గాలకి 1లక్ష 92 వేల కోట్ల రూపాయలు ఇచ్చారని.. జగన్ పాలనలో వెనుకబడిన కులాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. వైసీపీ పార్టీ వెనుకబడిన వర్గాల పార్టీ అని అభివర్ణించారు. మూడున్నరేళ్లలోనే జగన్ 98 శాతానికి పైగా ఎన్నికల హామీలనను అమలు చేశారన్నారు.
CM Jagan: లా నేస్తం నిధుల విడుదల.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న సీఎం
అంతకుముందు.. జగన్ పాలన చూసి చంద్రబాబు బృందానికి దిక్కుతోచక, మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని వరుదు కల్యాణి మండిపడ్డారు. మరోసారి మహిళల జోలికొస్తే చెప్పులతో కొడతామని వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనకు సంబంధించి సీఎం కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ టీడీపీ ప్రచురించిన పుస్తకాన్ని తప్పుపట్టారు. టీడీపీని, పదవిని, పార్టీ ఆస్తులన్నింటినీ లాక్కుని.. ఎన్టీఆర్ మరణానికి కారకుడైన నారావారి నారీమణి ఎవరు? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబుకు కత్తి అందించిన నారీమణి ఎవరని తాము పుస్తకాలు ముద్రించలేమా? అని రివర్స్ ఎటాక్ చేశారు.
తాజావార్తలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!