ఏపీలో కల్తీ మద్యం ఘటనలే దేశంలో అతి పెద్ద కుంభకోణం అని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అన్నారు. కల్తీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కుంభకోణంలో ఉన్న పెద్దలు అందరూ బయటకు రావాలని, టీడీపీకి నిజంగా సంబంధం లేకపోతే ఎందుకు సీబీఐ విచారణకు వెనకడుతుంది? అని ప్రశ్నించారు. కల్తీ మద్యానికి సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ నేతలే అని విమర్శించారు. కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా టీడీపీ నేతలు మార్చుకున్నారని, నారావారి…
మహిళల మీద చెయ్యి వేస్తే తాట తీస్తా అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి సెటైర్లు వేశారు. 50 మంది మహిళను నెల రోజుల నుంచి వేధిస్తే.. పవన్ కళ్యాణ్ గారు ఏం చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నించారు. టీడీపీ నేతల మద్దతుతో మహిళలు, చిన్నారులపై హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. హోం మంత్రి వంగలపూడి అనిత నివాసానికి కూత వేటు దూరంలో…