CM Jagan Released YSR Law Nestham Funds: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి బుధవారం ‘వైఎస్సార్ లా నేస్తం’ నిధులను విడుదల చేశారు. జూనియర్ లాయర్ల ఖాతాల్లోకి రూ. కోటి 55 వేలు జమ చేశారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 2,011 మంది జూనియర్ న్యాయవాదులకు లబ్ది చేకూరుతుంది. మూడేళ్లకు రూ.5 వేల చొప్పున వారికి ఆర్థిక సాయం అందనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. న్యాయవాదులుగా రిజిస్టర్ చేసుకున్న వారికి మొదటి మూడు సంవత్సరాలు చాలా ఇబ్బందులుంటాయని తనకు పాదయాత్రలో చెప్పారని గుర్తు చేసుకున్నారు. న్యాయవాదులకు అండగా ఉండేందుకే ఈ ‘లా నేస్తం’ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. తమ కాళ్లమీద తాము నిలబడగలిగే వృత్తిలో న్యాయవాదులున్నారని.. ప్రభుత్వం తోడుగా నిలబడ్డం వల్ల డబ్బులేని పేదవాడికి సహాయం చేయగులుగుతారనే విశ్వాసం ఉంటుందని అన్నారు.
Rajendra Prasad: బిగ్ బాస్ సోహెల్ తో కలిసి నటిస్తున్న నటకిరీటీ…
ఈ మూడున్నరేళ్లలో దాదాపు 4,248 మంది లాయర్లను తాము ప్రతినెలా ఆదుకున్నామని జగన్ చెప్పారు. వాళ్లు స్థిరపడటానికి వారికి తోడ్పాటు అందించామని, రూ. 35.4 కోట్లు సహాయంగా ఇచ్చామని, దాదాపు కోటి రూపాయల పైన వారికి జమ చేస్తున్నామని అన్నారు. ఈ పథకంలో కొత్తగా కొన్ని మార్పులు తీసుకొచ్చామన్న ఆయన.. ఆరు నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి 2 దఫాలుగా నిధులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. వారి అవసరాలు తీర్చుకునేలా వారికి ఉపయోగపడుతుందని రూ. 100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశామన్నారు. దాదాపు రూ.25 కోట్ల మేర లాయర్లకు కొవిడ్ సమయంలో మంచి జరిగిందన్నారు. అత్యంత పారదర్శకంగా దీన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఆధీకృత వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చని.. సంతృప్త స్థాయిలో దీన్ని అమలు చేస్తున్నామని, ఒక్కరు కూడా మిస్ కాకూడదనే ఉద్దేశంతో అమలు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.
Merugu Nagarjuna: చంద్రబాబును అన్ని సామాజిక వర్గాలు కలిసి తరిమికొడతాయి
మంచి జరగాలనే తపన, తాపత్రయంతో పాదయాత్రలో మాట ఇచ్చామని.. దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నామని జగన్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మంచిని పొందుతున్న లాయర్లు, పేదవాడిపట్ల అదే అంకిత భావాన్ని చూపాలని కోరుతున్నానని ఆకాంక్షించారు. మీమీ వృత్తుల్లో మరింత రాణించాలని మనసారా కోరుకుంటున్నానని న్యాయవాదులను ఉద్దేశించి వెల్లడించారు.