కామెడి సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి… తక్కువ సమయంలోనే స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు అల్లరి నరేష్. మినిమమ్ గ్యారెంటీ హీరో అని అందరితో అనిపించుకున్న అల్లరి నరేష్, ఆ తర్వాత ఊహించని డౌన్ ఫాల్ ని చూశాడు. ఒకానొక సమయంలో అల్లరి నరేష్ కెరీర్ అయిపొయింది, ఇక అతనికి సినిమాలు ఉండవు అనే మాట కూడా వినిపించింది. ఇలాంటి సమయంలోనే ట్రెండ్, ట్రాకు రెండూ మార్చి అల్లరి నరేష్ ‘నాంది’ సినిమా చేశాడు. ఈ మూవీ అల్లరి నరేష్ లోని కొత్త కోణం బయటకి తీసింది, అతనిలోని సీరియస్ నటుడిని అందరికీ పరిచయం చేసింది. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ‘నాంది’ మూవీతో అల్లరి నరేష్ కెరీర్ కొత్తగా షేప్ చేసింది. అల్లరి నరేష్ కామెడీ మాత్రమే కాదు అన్ని ఎమోషన్స్ ని పండించగలడు అని ఆడియన్స్ నమ్మేలా చేసింది. ఇటివలే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో ఆడియన్స్ ని పలరించిన అల్లరి నరేష్, మరోసారి విజయ్ కనకమేడలతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు.
Read Also: Allari Naresh: ‘ఉగ్రం’ తో మరో ‘నాంది’ని చూపించబోతున్నాడా..?
షైన్ స్క్రీన్ బ్యానర్ లో అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్ నుంచి రెండో సినిమా రానుంది. ‘ఉగ్రం’ అనే టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీ, ప్రకటనతో మంచి బజ్ ని జనరేట్ చేసింది. గతంలో ఉగ్రం నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ ని మంచి పేరొచ్చింది. లేటెస్ట్ గా షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఉగ్రం మూవీ టీజర్ ని అక్కినేని నాగ చైతన్య లాంచ్ చేశాడు. ఈ టీజర్ యాక్షన్ మోడ్ లో స్టార్ట్ అయ్యి, మరింత యాక్షన్ తో ఎండ్ అయ్యింది. నైట్ ఎఫెక్ట్ లో పోలిస్ గెటప్ లో అల్లరి నరేష్ మాస్ హీరో అనిపించే రేంజులో ఉన్నాడు. మీసాలు తిప్పి, మాస్ డైలాగులని కూడా చెప్తున్న అల్లరి నరేష్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. జస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ డ్యురేషన్ తో రిలీజ్ అయిన ఈ టీజర్ ని బట్టి చూస్తే ‘భార్య, కూతరుతో ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తున్న ఒక పోలిస్ ఆఫీసర్ ఫ్యామిలీని టచ్ చెయ్యడంతో తిక్కరేగిన ఒక పోలీసోడు’ ఎలా రివోల్ట్ అయ్యాడు అనేది ‘ఉగ్రం’ సినిమా కథలా కనిపిస్తోంది. టీజర్ లో అల్లరి నరేష్ రెండు వేరియేషన్స్ ఉన్న లుక్ లో కనిపించాడు. టీజర్ లో చూపించిన షాట్స్, యాక్షన్ బ్లాక్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా శ్రీ చరణ్ పాకాల ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ‘ఉగ్రం’ టీజర్ ని మరింత ఎలివేట్ చేసింది. మొత్తానికి ముందు నుంచీ అనుకుంటున్నట్లే ఉగ్రం టీజర్ సినిమాపై అంచనాలని అమాంతం పెంచేసింది. మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ ని అల్లరి నరేష్ అండ్ విజయ్ కనకమేడల ఎంతవరకూ అందుకుంటారో చూడాలి.
Get ready to face the fire 🔥🔥
Presenting @allarinaresh like never before 💥💥#Ugram Teaser out now!
– https://t.co/k7x8gA4j3X#NareshVijay2 @mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi @SricharanPakala @brahmakadali pic.twitter.com/A9bqMQX4wg— Shine Screens (@Shine_Screens) February 22, 2023