తెలంగాణ ఫోక్ సాంగ్స్ అనగానే గుర్తొచ్చే సింగర్ మంగ్లీ. బతుకమ్మ నుంచి బోనాల పాటల వరకూ మంగ్లీ పాడని పాటే లేదు. ఇక కల్చరల్ సాంగ్స్‌తో పాటు ఎన్నో సినిమాల్లో కూడా అద్భుతమైన పాటలు పాడింది. న్యూస్ యాంకరింగ్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన మంగ్లీ, ఆ తర్వాత ప్రైవేట్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయింది. ప్రధానంగా బోనాలు, శివరాత్రి పాటలు ద్వారా ఫేమ్ సంపాదించుకుంది. ఇక ప్రజంట్ మూవీస్ లో వరుస పాటలు, ఈవెంట్లతో దూసుకుపోతున్న మంగ్లీ కి ఊహించని షాక్ తగిలింది.
Also Read : Jr NTR : ‘వార్ 2’ మూవీ డబ్బింగ్ పనులు.. షురూ చేసిన తారక్
తాజాగా చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో తన బర్త్ డే పార్టీ జరుపుకుంది మంగ్లీ. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. పార్టీలో గంజాయి తీసుకుంటూ కోందరు పట్టుబడ్డారు. గంజాయితో పాటు విదేశీ మద్యం కూడా పట్టుకున్నారు. ఇలా అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు గాను,ఎక్సైజ్ పర్మిషన్ లేకుండా లిక్కర్ నిర్వహించినందుకు గాను, గంజాయి వాడకం సంబంధించి.. ఎన్‌డీపీఎస్ యాక్ట్‌ల కింద, మంగ్లీతో పాటు త్రిపుర రిసార్ట్స్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, మంగ్లీ ఈవెంట్ మేనేజర్ బుని మేఘరాజ్, దామోదర్ రెడ్డిల మీద కేసు నమోదు కేసు నమోదు చేశారు. అలాగే డీజే కూడా అనుమతి లేకుండా ప్లే చేసినందుకు డిజే సీజ్ చేశారు. కాగా ఈ బర్త్ డే పార్టీలో సెలబ్రిటీలు దివి, కాసర్ల శ్యామ్.. తదితరులు ఉన్నట్లు గుర్తించారు. పద్దతిగా కనిపించే మంగ్లీ ఇలాంటివి ప్రోత్సహించడం ఏంటీ అంటూ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.