హోంమంత్రి అనిత ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి అనిత మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రం నుంచి 21 మంది సీఎం లను చూశాం. కానీ, ఆంధ్రప్రదేశ్ సీఎం అంటే టక్కున చంద్రబాబు గుర్తొస్తారు.. ఆర్ధికంగా ఇబ్బంది ఉన్నా ప్రజలకు మంచి చెయ్యాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు పని చేస్తారు.. 14 ఏళ్ల సీఎం చంద్రబాబు ప్రయాణంలో సంక్షేమం.. అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు.. ఈ నెలలోనే అన్నదాత సుఖిభవ..స్త్రీ శక్తి పథకాలను ప్రారంభించాము.. ఈ 14 నెలల్లో…
టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి.. ఈ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి అనిత.. ప్రసన్నకుమార్ రెడ్డిని వెంటనే వైసీపీ నుంచి సస్పెండ్ చేయండి అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు సలహా ఇచ్చారు.
పాయకరావుపేట బీసీ బాలికల కాలేజ్ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు ఊహించని ఘటన ఎదురైంది.. హాస్టల్‌లో బాలికలతో కలిసి భోజనం చేస్తుండగా.. ఆమె తన ఫ్లేట్ వైపు చూసి.. కొంత ఆశ్చర్యానికి గురయ్యారు.
అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. విజయనగరం కలెక్టరేట్‌లో జరిగిన డీఆర్సీ సమావేశానికి హాజరైన ఆమె.. డీఆర్సీలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఏదో కాకి లెక్కలతో కాగితాల దొంతులుగా ప్రెస్‌నోట్ మా కిచ్చి వెళ్లిపోతున్నారని ఫైర్ అయ్యారు.. కానీ, ఆ పేపర్లు తర్వాత చెత్త బుట్టలోకి వెళ్లిపోతున్నాయి.. అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు..
కొత్తగా పది పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి.. జిల్లాకు ఒక సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం అన్నారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. గుంటూరు రేంజ్ పరిధిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు హోంమంత్రి.. గుంటూరు, రాజధాని అమరావతి, హైకోర్టు, పొలిటికల్ పార్టీల ఆఫీసులు ఈ ప్రాంతంలో ఉన్నాయని.. పల్నాడులో ఫ్యాక్షన్ కొన్నిచోట్ల ఉంది..
మాజీ సీఎం గనుక వైఎస్ జగన్‌కు భద్రత ఇచ్చాం.. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే.. వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ మాత్రమే ఆయనకు వర్తిస్తుందన్నారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..
నిన్నటి జగన్ టూర్ డ్రామాను తలపించింది.. ఏదో రకంగా శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు అంటూ మండిపడ్డారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. వైసీపీ హయాంలో ఐపీసీ సెక్షన్ ప్రకారం కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం పోలీసులు వ్యవహరించారని విమర్శించారు.. ఇక, జగన్ పర్యటన కోసం 1100 మంది పోలీసులను పెట్టాం.. జగన్ వెళ్లే ప్రాంతం చాలా సెన్సిటివ్ ఏరియా.. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నాం..
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడో మరోసారి తెరపైకి వచ్చింది.. ఈ కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై విచారణ చేస్తామన్న ఆమె.. సాక్షుల వరుస మరణాల అంశంపై కేబినెట్‌లో చర్చించాం సమగ్ర దర్యాప్తు జరపాలని అదేశించాం అన్నారు..