వైజాగ్ వచ్చే పర్యాటకులు బీచ్‌లో కూర్చుని టీ తాగడానికి రారు.. వాళ్లకు కావాల్సింది ఎంజాయ్‌మెంట్ అన్నారు అయ్యన్నపాత్రుడు.. నిబంధనల పేరుతో నియంత్రణ పెడితే పర్యాటకులు రారన్న ఆయన.. ఎంజాయ్ చేయడానికి అవసరమైన సౌకర్యాలు ఉండాలన్నారు. టూరిజంకు మినహాయింపులు ఇవ్వాలని పేర్కొన్నారు.. రూల్స్ అవసరమే.. కానీ, కొంత వెసులు బాటు వుండాలన్నారు.. గిరిజన ప్రాంతాలలో పెట్టుబడి పెట్టేందుకు స్థానికులు ఉండాలనే నిబంధనకు పరిష్కారం చూడాలి.. ఆఫీసియల్స్ పాజిటివ్ మైండ్‌తో వుండాలన్నారు.
రెవెన్యూ సదస్సులకు సిద్ధం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించనున్నట్టు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు డిసెంబర్ 6, 2024 - జనవరి 8, 2025 వరకు నిర్వహిస్తామన్నారు.. గ్రామస్థాయిలో భూమి తగాదాలు, రీ సర్వే అవకతవకలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశంగా స్పష్టం చేశారు.