కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో ఉద్యోగాల భర్తీ రిజర్వేషన్ విధానాన్ని అనుసరించే జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పేర్కొన్నారు. రాజ్యసభలో బుధవారం వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ సైనిక దళాల్లో ఉద్యోగాల భర్తీ కుల ప్రాతిపదికన జరగదని చెప్పారు. అయితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆర్థికంగా వెనకబడ్డ తరగతులకు కల్పించిన రిజర్వేషన్ ప్రాతిపదికపైనే ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుంది. షెడ్యూల్డ్ కులాల కోటాలో భర్తీ కాకుండా మిగిలిపోయిన ఖాళీలను తదుపరి నిర్వహించే నియామకంలో భర్తీ చేస్తామని మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు.
సాయుధ బలగాల ఉద్యోగాల భర్తీలో కేంద్రం నిర్లిప్తంగా వుందని విపక్షాలు మండిపడుతున్నాయి. అగ్నిపథ్ స్కీం ద్వారా తాత్కాలికంగా ఉద్యోగాల భర్తీకి ప్రయత్నించినా.. దానిపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 2020 జనవరి 1 నాటికి రాష్ట్రాలు, కేంద్ర స్థాయి పోలీసు శాఖకు సంబంధించి హోం మంత్రిత్వ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. కేంద్ర హోంశాఖ పరిధిలోని పోలీసు పరిశోధన అభివృద్ధి సంస్థ(బీజీఆర్డీ). దేశంలో వివిధ రాష్ట్రాల్లో 5,31,737 పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర సాయుధ పోలీసు దళాల్లోనూ 1,27,120 ఖాళీలున్నాయని హోంశాఖ తెలిపింది. ఇదిలా వుంటే 2019లో ఆయా విభాగాల్లో మొత్తం 1,19,069 నియామకాలు జరిగాయని బీజీఆర్డీ తెలిపింది.
మరోవైపు భద్రత విధుల నిర్వహణలో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని నివేదిక తెలిపింది. గతంలో కేవలం 10.30 శాతం ఉన్న మహిళా బలగాలు.. గతేడాది జరిగిన నియామకాల ద్వారా 16.05 శాతానికి పెరిగాయి.
VijaySai Reddy: ఏపీలో కోస్తా తీరానికి కోత ముప్పు