ఉద్యోగం.. బిజినెస్ ఏదో ఒకటి చేస్తున్నంత కాలం ఎలాంటి ఢోకా ఉండదు. కానీ వృద్ధాప్య దశకు చేరుకున్నాక ఆర్థిక కష్టాలు వెంటాడుతుంటాయి. బతుకు భారంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా సురక్షితంగా ఉంటే, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవచ్చు. అందువల్ల, ఇప్పటి నుండే రేపటి కోసం పొదుపు చేయడం ముఖ్యం. పెట్టుబడి పెట్టేందుకు కేంద్రం అందించే అటల్ పెన్షన్ యోజన పథకం అద్భుతంగా ఉంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే భార్యాభర్తలిద్దరు ప్రతి నెల రూ. 10 వేలు పొందే ఛాన్స్ ఉంటుంది.
Also Read:Kurnool POCSO Court: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. కర్నూలు పోక్సో కోర్టు సంచలన తీర్పు
అటల్ పెన్షన్ యోజన కింద, మీరు, మీ జీవిత భాగస్వామి ఇద్దరూ చెరో రూ. 5000 పెన్షన్ పొందవచ్చు. మొత్తంగా, మీకు రూ. 10,000 పెన్షన్ లభిస్తుంది. ఈ పథకానికి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అసంఘటిత కార్మికులకు కూడా పెన్షన్ అందించాలనే సదుద్దేశంతో కేంద్రం ఈ అటల్ పెన్షన్ స్కీమ్ ని తీసుకొచ్చింది. ఈ పథకంలో నెలకు రూ. 420 చెల్లిస్తే భార్యాభర్తలిద్దరు నెలకు రూ. 10 వేలు పొందొచ్చు. ఈ పథకంలో చేరి పెట్టుబడి పెడితే.. 60ఏళ్ల తర్వాత పెట్టిన పెట్టుబడిపై ఆదారపడి ప్రతి నెల పెన్షన్ రూపంలో ఆదాయం సమకూరుతుంది. అయితే ఈ స్కీమ్ లో చేరే వ్యక్తుల వయసును బట్టి చెల్లించే మొత్తం మారుతూ ఉంటుంది.
Also Read:Pakistan: అభినందన్‌ను పట్టుకున్న మేజర్ హతం.. అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ హజరు..
పెట్టిన పెట్టుబడిపై 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 1000, రూ. 2000, రూ. 3 వేలు, 4 వేలు, గరిష్టంగా రూ. 5 వేల వరకు పెన్షన్ పొందొచ్చు. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి ఈ స్కీమ్ లో చేరితే నెలకు రూ. 42 నుంచి గరిష్టంగా రూ. 210 వరకు చెల్లించాలి. ఒక వేళ నెలకు రూ. 210 చెల్లించాలనుకుంటే.. రోజుకు రూ. 7 ఆదా చేస్తే చాలు. 60ఏళ్లు నిండిన తర్వాత రూ. 5 వేల పెన్షన్ అందుకోవచ్చు. భార్యాభర్తలిద్దరు చేరితే అప్పుడు రోజుకు రూ. 14 ఆదా చేసి నెలకు రూ. 420 చెల్లిస్తే చాలు. అప్పుడు దంపతులిద్దరికీ కలిపి నెలకు రూ. 10 వేల వరకు పెన్షన్ వస్తుంది.
Also Read:Ayesha Meera Case: హైకోర్టులో ఆయేషా మీరా తల్లిదండ్రుల పిటిషన్.. తుది నివేదిక పరిశీలించండి..
ఇక ఈ అటల్ పెన్షన్ స్కీంలో అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఆన్ లైన్ లో చేసుకోవచ్చు. లేదా బ్యాంకుల్లో ఖాతా ఓపెన్ చేయొచ్చు. అటల్ పెన్షన్ యోజన స్కీంలో ఇన్వెస్ట్ చేయదలిచిన వారికి పోస్టాఫీస్ లేదా ప్రభుత్వ రంగ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. నేషనల్ పెన్షన్ స్కీం పరిధిలోకి వచ్చేవారు అనర్హులు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు కూడా ఈ పథకానికి అర్హులు కారు.