Vijayawada Utsav: వైబ్రంట్ విజయవాడ ఉత్సవాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. బెజవాడ దుర్గ గుడి భూముల్లో వైబ్రెంట్ విజయవాడ ఉత్సవ్ పేరుతో వాణిజ్య కార్యకలాపాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు.. కేసు విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం.. విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని.. విజయవాడ ఉత్సవ్ కు ఉన్న అన్ని అడ్డంకులు తొలిగాయి అన్నారు.. అమ్మవారి ఆశీస్సులతో ఎగ్జిబిషన్ ఏర్పాటుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ నెల 24వ తేదీ నుంచి ఎగ్జిబిషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు.. అయితే, కృష్ణా నది వరద ఉధృతి కారణంగా వాటర్ స్పోర్ట్స్ రద్దు చేశాం అని వెల్లడించారు.. కానీ, వరద ఉధృతి తగ్గాక వాటర్ స్పోర్ట్స్ అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు ఎంపీ కేశినేని చిన్ని..
Read Also: Chiranjeevi : చిరంజీవి 47 ఏళ్ల సినీ ప్రయాణం.. ప్రాణం ఖరీదు జ్ఞాపకాలను పంచుకున్న మెగాస్టార్
కాగా, దేవాదాయ శాఖకు చెందిన భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.. విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానికి సంబంధించిన దేవాదాయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. దేవాదాయ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది.. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించింది.. అందులో తోలిన గ్రావెల్, మట్టి, కంకరలను వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది.. అంతేకాదు, ఆ భూములను యథాస్థితికి తీసుకు రావాలని ఆదేశించింది.. దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా.. విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. కానీ, ఈ వ్యవహారంపై ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. ఈ విషయంపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు..