Minister Satyakumar: విజయవాడ ఉత్సవ్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రి సత్యకుమార్ యాదవ్ తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి నాయకులు హాజరయ్యారు. విజయవాడ ఉత్సవ్ దిగ్విజయం చేయడంపై ప్రజాపత్రినిధులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుందాం.. అంతరించిపోతున్న కళలను పరిరక్షించుకుంటూ వేడుకలు నిర్వహిద్దాం అని పిలుపునిచ్చారు.
Read Also: Dog Attacks: రెండు సార్లు కరిచిన కుక్కకు జీవిత ఖైదు..? ఫస్ట్ టైమ్ కరిస్తే 10 రోజులు జైలు శిక్ష..!
ఇక, ప్రజలను ఇందులో మమేకం చేద్దామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దసరా అంటే ప్రజలకు విజయవాడ వెళ్లాలనిపించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం.. విజయవాడను పర్యాటకంగా తీర్చిదిద్దడానికి ఈ వేడుకలు దోహదపడతాయి అన్నారు. ఈ ఏడాది మొదలు పెట్టిన చిన్న ప్రయత్నం ప్రపంచానికి చాటి చెప్పేలా చేస్తామన్నారు. ఈ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్న సమయంలో నాకు భాగస్వామ్యం కల్పించటం సంతోషంగా ఉందన్నారు. దసరా అంటే దేశం అంతా విజయవాడ వైపు చూసేలా నిర్వహిస్తాం.. మైసూర్ తరహాలో విజయవాడలో దసరా ఫెస్టివల్ నిర్వహిస్తామని సత్యకుమార్ చెప్పుకొచ్చారు.