Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Sit Speeds Up Investigation Into Ap Liquor Scam Case

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్‌ కేసులో సిట్‌ దూకుడు..

Published Date :May 2, 2025 , 8:20 am
By Sudhakar Ravula
  • లిక్కర్ స్కాం పై విచారణలో జోరు పెంచిన సిట్ ..
  • రూ.3200 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్లుగా కేసు..
  • మొత్తం 29 మంది మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ..
  • ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిల సిట్ విచారణ.. ఏ-1గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి..
  • ఏ-1 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏ- 6 సజ్జల శ్రీధర్ రెడ్డి..
  • ఏ-8 చాణక్యలను అరెస్ట్ చేసిన సిట్..
  • కసిరెడ్డి పీఏ పైలా దిలీప్ చెన్నై ఎయిర్ పోర్టులో అరెస్ట్..
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్‌ కేసులో సిట్‌ దూకుడు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కుంభకోణం కేసు దర్యాప్తును సిట్‌ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌ కేసిరెడ్డితోపాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా రాజ్‌ కేసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌ను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం ఆయన దగ్గర ఉందని భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా దిలీప్‌ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతడు దుబాయ్‌కి పారిపోయేందుకు చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. పక్కా సమాచారంతో దిలీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫోన్‌ లొకేషన్‌ ద్వారా అతడి కదలికలపై నిఘా పెట్టిన సిట్‌ బృందం.. చెన్నై ఎయిర్‌పోర్టులో ఉన్నట్లు గుర్తించి అక్కడ అదుపులోకి తీసుకుంది.

Read Also: Dil Raju : ‘హిట్ 3’ దయ వల్ల తెలుగు ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది..

Also Read

  • Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
  • V Srinivasa Rao: డీలిమిటేషన్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభ‌జ‌న హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
  • YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్‌ జగన్‌ మాజీ సీపీఆర్‌వో శ్రీహరి అరెస్ట్..
  • Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..

మరోవైపు మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌ కేసిరెడ్డిని సీఐడీ కస్టడీకి అప్పగించేందుకు విజయవాడ కోర్టు అనుమతిచ్చింది. వారం రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అతడిని విచారించేందుకు అంగీకరించింది. ఈ కేసులో కీలకంగా ఉన్న అతడిని విచారించేందుకు 10 రోజుల కస్టడీకి అప్పగించాలని సీఐడీ పిటిషన్‌ దాఖలు చేయగా.. వారం రోజులకు న్యాయస్థానం అనుమతిచ్చింది. కేసులో నిందితులుగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, చాణక్య ఆస్తుల వివరాలు సేకరిస్తోంది సిట్‌. స్కామ్‌ జరిగిన సమయంలో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఇవ్వాలని రిజిస్ట్రార్‌ శాఖ ఐజీకి లేఖలు ఇచ్చింది సిట్‌. ఏపీతో పాటు తెలంగాణ ఐజీ రిజిస్ట్రార్‌కు కూడా లేఖ రాసింది. కేసిరెడ్డి భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు సిట్‌ అధికారులు. ఈ క్రమంలో దిలీప్‌కు కూడా నోటీసులు ఇస్తారని తెలుస్తోంది.

Read Also: Eknath Shinde: ‘‘ప్రధాని మోడీ పాకిస్తాన్‌ని తుడిచిపెడతారు’’.. డిప్యూటీ సీఎం కామెంట్స్..

మొత్తం లిక్కర్ స్కాం పై సిట్ విచారణలో జోరు పెంచింది. 3200 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్టుగా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో వ్యక్తులతో పాటు సంస్థల పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించి మొత్తం 29 మంది మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. కేసుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి లను కూడా సిట్ విచారించింది మొత్తం ఈ కేసులో కీలక పాత్రధారిగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని గుర్తించి కేసులో ఏవన్ గా చేర్చింది సిట్. కేసు నమోదు చేసిన తర్వాత అరెస్టులపై కూడా సిట్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు ముగ్గురిని సిట్ అరెస్టు చేసింది. ఏ1 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ 6 సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ8 చాణక్యలను ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసింది.

Read Also: Jagtial: అడవిలో ఒంటరిగా వృద్ధురాలు.. విషాద కథలో బిగ్ ట్విస్ట్!

గురువారం కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పీఏ పైలా దిలీప్ ను చెన్నై ఎయిర్ పోర్ట్ లో సిట్ అదుపులోకి తీసుకుంది. కేసిరెడ్డి ఆర్థిక వ్యవహారాలన్నీ దిలీప్ చూశాడని సీట్ గుర్తించింది ఈ పరిస్థితుల్లో దిలీప్ కు నోటీసులు ఇద్దామని గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న సిట్.. అతను పరారీలో ఉండటంతో సెల్ఫోన్ పై టెక్నికల్ గా నిఘా పెట్టి చెన్నైలో దిలీప్ ని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసింది. దిలీప్ ని ఇవాళ కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించిన సిట్ దానికి సంబంధించిన అధికారిక వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో ఉన్న ఐజీ రిజిస్టార్లకు లేఖలు అందించింది. 2019 నుంచి 24 వరకు వైసిపి హయాంలో కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించే పనిలో సిట్ ఉంది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Liquor Scam Case
  • SIT
  • Sit Investigation

తాజావార్తలు

  • Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..

  • Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!

  • UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్‌కు లాభం, పాకిస్తాన్‌కు నష్టం..

  • Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!

  • Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions