Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
- ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్త నిబంధనలు
- స్లాబ్ విస్తీర్ణం పెంచితే నిధుల విడుదలకు బ్రేక్
- అప్పుల బారిన పడకుండా ఉండేందుకే తాజా నిర్ణయం
- జీఐ షీట్లు, సన్షేడ్ల వినియోగానికి ప్రభుత్వ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం లబ్ధిదారులకు గృహనిర్మాణ శాఖ కీలక షాక్ ఇచ్చింది. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా, అనుమతించిన ప్లాన్‌కు మించి స్లాబ్ విస్తీర్ణాన్ని పెంచే వారిపై గట్టి నియంత్రణ విధించింది. ఇకపై నిబంధనలు అతిక్రమించి పెద్ద సైజుల్లో స్లాబులు వేస్తే ప్రభుత్వ నిధుల విడుదల నిలిచిపోతుందని స్పష్టం చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు కూడా వర్తిస్తాయని గృహనిర్మాణ శాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అప్పుల బారిన పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం
క్షేత్రస్థాయిలో చాలా మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో గోడల కంటే 3 నుంచి 8 అడుగుల వరకు స్లాబ్‌ను ముందుకు పొడిగిస్తూ భారీగా ఖర్చు పెంచుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయల సాయం సరిపోక, మిగిలిన మొత్తానికి పేదలు అప్పుల బారిన పడుతున్నారు. మరికొందరు ఆర్థిక భారం తట్టుకోలేక ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే వదిలేస్తున్నారు. ఈ ఇబ్బందులను అరికట్టి, ప్రభుత్వ సాయంతోనే ఇళ్లు పూర్తిగా పూర్తి కావాలనే ఆందోళనతో అధికారులు స్లాబ్ వైశాల్యంపై పరిమితులు విధించారు.
Also Read
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
కొత్త కొలతలు , నిబంధనలు ఇవే
ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. 400 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా కలిగిన ఇంటికి స్లాబ్ వైశాల్యం గరిష్టంగా 500 చదరపు అడుగుల లోపు మాత్రమే ఉండాలి. అలాగే, 600 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా కలిగిన ఇంటికి స్లాబ్ గరిష్టంగా 750 చదరపు అడుగుల వరకే పరిమితం కావాలి. ఇంటి ముందు వైపు స్లాబ్ పొడిగింపును గరిష్టంగా 3 అడుగులకే పరిమితం చేయాలని, మిగిలిన మూడు వైపులా కేవలం ఒక అడుగు మాత్రమే పొడిగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రత్యామ్నాయాలపై అవగాహన కల్పించాలి
భారీ ఆర్సీసీ స్లాబుల పొడిగింపునకు బదులుగా, కిటికీలు , తలుపులపై సాధారణ సన్షేడ్లు లేదా సజ్జాలను ఏర్పాటు చేసుకోవాలని లబ్ధిదారులకు ప్రభుత్వం సూచించింది. అలాగే, ఇంటి ముందు నీడ కోసం కాంక్రీట్ స్లాబ్‌ను వాడకుండా తక్కువ ఖర్చుతో కూడిన జి.ఐ షీట్లను ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఈ సరికొత్త నిబంధనలపై క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించాలని, ఎక్కడా ఉల్లంఘనలు జరగకుండా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లను, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
తాజావార్తలు
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..