మనకు తెలిసి సరైన చిత్రాలు రాక ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారు. ఏదో ఒక్క మూవీ హిట్ వస్తున్న క్రమంలో తప్పితే, మిగతా టైం లో అసలు తెలుగు చిత్రాలు ఏవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. దీంతో గత నెల రోజులుగా డిస్ట్రిబ్యూషన్ వర్గం చూస్తున్న నరకం అంతా ఇంతా కాదు. కొన్ని చోట్ల సింగల్ స్క్రీన్లు మూసేసే పరిస్థితి. కనీసం జీతాలు ఇచ్చేంత కలెక్షన్ రాకపోతే వాటి యాజమాన్యం అంతకన్నా ఏం చేస్తుంది. ఇలాంటి సమయంలో నాని ‘హిట్ 3’ దాని మార్చేసింది. అంచానల ప్రకారం రెండు మూడు రోజుల ముందు నుంచే, అడ్వాన్స్ బుకింగ్స్ లో భారీ ఫిగర్లు నమోదు చేసిన ఈ మూవీ మార్నింగ్ షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో బయ్యర్లు ఊపిరి పీల్చు కుంటున్నారు. అంతేకాదు చాలా చోట్ల షోలు ఫుల్ అయిపోయి. అదనంగా జోడించాల్సిన అవసరంలో ఏ మాత్రం ఉన్నా సర్దుబాటు చేస్తున్నారు. దీంతో మూవీ టీం చిన్న ప్రెస్ మీట్ నిర్వాహించింది.
Also Read: MaheshBabu : SSMB29 కి లాంగ్ బ్రేక్..?
ఇందులో భాగంగా నిర్మాత దిల్ రాజు చాలా ఆనందం వ్యక్తం చేశారు.. ‘ లాస్ట్ మంత్ అంతా సినిమాలు వస్తున్నాయి కానీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడం లేదు, సమ్మర్ అయిపోతుంది అనుకుంటున్న తరుణంలో. ఏప్రిల్ నెలలో సరైన సినిమాలు లేక చాలా సింగిల్ స్క్రీన్స్ ఏపీ తెలంగాణలో క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి సమయంలో మా హోప్స్ అన్నీ కూడా ‘హిట్ 3’ మీదే ఉన్నాయి. ఆడియన్స్ సినిమాకి ఏ రేంజ్‌లో హిట్ ఇస్తారో అని ఊపిరి బిగపటుకుని ఉన్నను. కానీ ఈ సినిమాకి మూడు రోజులు ముందుగానే ఆన్లైన్ బుకింగ్ చూసి జనాలు థియేటర్స్ కి వస్తున్నారని హ్యాపీగా ఫీలయ్యా. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. ట్రెమండస్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈరోజు ప్రొడ్యూసర్ కం హీరోగా సూపర్ హిట్ ఇచ్చావు నాని. ఆడియన్స్ మంచి సినిమా ఇస్తే చూడ్డానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్లీ మాకు ఎనర్జీ ఇచ్చారు. కచ్చితంగా మా వంతు కూడా బాధ్యత ఉంది. ఎప్పటికప్పుడు మీకు కొత్త సినిమాలు ఇచ్చి మిమ్మల్ని థియేటర్స్ కి రప్పించే ప్రయత్నం చేస్తాము. శైలేష్ కు హ్యాట్రిక్ కంగ్రాట్యులేషన్స్. అందరికీ థాంక్యు వెరీ మచ్’ అంటూ తెలిపారు.