Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం.. షాకిచ్చిన నూజివీడు కోర్టు..
- వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం..
- నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో పీటీ వారెంట్ కు అనుమతి..
- వంశీపై పీటీ వారెంట్ కు అనుమతి ఇచ్చిన నూజివీడు కోర్టు..
- ఈ నెల 19 లోపు వల్లభనేనిని హాజరు పరచాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్ కు అనుమతి ఇచ్చింది నూజివీడు కోర్టు.. ఈ నెల 19వ తేదీలోపు వల్లభనేని వంశీ మోహన్‌ను ఈ కేసులో హాజరు పరచాలని ఆదేశాలు ఇచ్చింది నూజివీడు కోర్టు.. అయితే, ఇప్పటికే వల్లభనేని వంశీపై ఆరు కేసులు ఉండగా.. ఐదు కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ వచ్చింది.. కానీ, రేపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెలువడనుంది.. దీంతో, రేపు వంశీకి బెయిల్ వచ్చినా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.. మరోవైపు.. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీని కోర్టులో హాజరు పర్చనున్నారు పోలీసులు.. రేపే వంశీని నూజివీడు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందంటున్నారు..
Read Also: India Turkey: టర్కీకి షాక్ ఇచ్చిన భారత్..
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
వల్లభనేని వంశీపై మొత్తం ఆరు కేసులు నమోదు కాగా.. ఇప్పటికే ఐదు కేసుల్లో వంశీకి బెయిల్, ముందస్తు బెయిల్ మంజూరు అయ్యాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాత్రం.. వంశీ బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు వెల్లడించనుంది కోర్టు.. అయితే, ఈ సమయంలో బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో మాజీ ఎమ్మల్యే వల్లభనేని వంశీపై నమోదైన కేసులో ఇవాళ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్ కు అనుమతి ఇచ్చింది నూజివీడు కోర్టు.. దీంతో, వల్లభనేని వంశీకి రేపు బెయిల్ వచ్చినా.. జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది.. ఇక, రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ జైల్లో అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంతో ఆయన ఇబ్బందులు పడ్డారు. ఇది గమనించిన పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!