RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
- రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు
- అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRB Paramedical Recruitment 2026: భారతీయ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (RRBs) CEN No. 05/2026 ద్వారా పారామెడికల్ కేటగిరీల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 590 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 2026 సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమవుతుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 14, 2026 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వివరాల కోసం ఈలింక్ పై క్లిక్ చేయండి.
ముఖ్యమైన తేదీలు
ఇండికేటివ్ నోటీస్ -12 సెప్టెంబర్ 2026
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం -15 సెప్టెంబర్ 2026
దరఖాస్తుకు చివరి తేదీ -14 అక్టోబర్ 2026, రాత్రి 11:59
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ -16 అక్టోబర్ 2026
అప్లికేషన్ కరెక్షన్ విండో -17–26 అక్టోబర్ 2026
స్క్రైబ్ వివరాల సమర్పణ -27–31 అక్టోబర్ 2026
CBT పరీక్ష తర్వాత ప్రకటిస్తారు
Also Read
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
పోస్టుల వారీగా ఖాళీలు
RRB పారామెడికల్ రిక్రూట్మెంట్ 2026లో Nursing Superintendent పోస్టులకు 365 ఖాళీలు ఉండగా, ఇవి Level 7 పే లెవల్లో ఉండి ప్రారంభ వేతనం రూ.44,900గా ఉంటుంది. Dialysis Technician పోస్టుకు 1 ఖాళీ, Health & Malaria Inspector Gr. IIకి 43 ఖాళీలు, Audiologist & Speech Therapistకు 1 ఖాళీ ఉన్నాయి. ఈ మూడు పోస్టులు Level 6లో ఉండగా ప్రారంభ వేతనం రూ.35,400గా ఉంటుంది. అలాగే Pharmacist (Entry Grade) పోస్టులకు 118 ఖాళీలు, Radiographer/X-Ray Technician పోస్టులకు 25 ఖాళీలు ఉన్నాయి.
ఈ రెండు పోస్టులు Level 5లో ఉండి ప్రారంభ వేతనం రూ.29,200గా ఉంటుంది. ECG Technician పోస్టులకు 4 ఖాళీలు, Optometrist పోస్టులకు 2 ఖాళీలు ఉండగా, ఇవి Level 4లో ఉండి ప్రారంభ వేతనం రూ.25,500గా ఉంటుంది. ఇక Lab Assistant Gr. II పోస్టులకు 31 ఖాళీలు ఉండగా, Level 3 పే లెవల్లో ప్రారంభ వేతనం రూ.21,700గా ఉంటుంది. మొత్తంగా RRB పారామెడికల్ కేటగిరీల్లో 590 ఖాళీలు ఉన్నాయి.
వయస్సు ఎంత ఉండాలి?
పోస్ట్‌ను బట్టి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సును 01 జనవరి 2027 నాటికి లెక్కిస్తారు. SC, ST, OBC, PwBD, Ex-Servicemen తదితర రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు ఇవే
పోస్ట్‌ను బట్టి విద్యార్హతలు మారుతాయి.
Nursing Superintendent: B.Sc Nursing లేదా GNMతో పాటు Registered Nurse & Midwife సర్టిఫికేట్.
Dialysis Technician: B.Sc + Haemodialysisలో డిప్లొమా లేదా నిర్దేశిత ఇన్‌హౌస్ ట్రైనింగ్.
Health & Malaria Inspector Gr. II: Chemistryతో B.Sc + Health/Sanitary Inspectorలో డిప్లొమా లేదా NTC.
Audiologist & Speech Therapist: BASLP డిగ్రీ + RCI రిజిస్ట్రేషన్.
Pharmacist: B.Pharmacy డిగ్రీ.
Radiographer/X-Ray Technician: 10+2లో Physics, Chemistryతో పాటు Radiography/X-Ray Technician/Radiodiagnosis Technologyలో డిప్లొమా.
ECG Technician: 10+2/Scienceలో గ్రాడ్యుయేషన్‌తో పాటు ECG/కార్డియాలజీ సంబంధిత సర్టిఫికెట్, డిప్లొమా లేదా డిగ్రీ.
Optometrist: B.Sc Optometry లేదా Ophthalmic Technicianలో డిప్లొమా.
Lab Assistant Gr. II: 10+2 Science + Medical Laboratory Technology (DMLT)లో డిప్లొమా.
ముఖ్యంగా.. అభ్యర్థులు తమ విద్యార్హతలను 14 అక్టోబర్ 2026 నాటికి పూర్తి చేసి ఉండాలి. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్కు అర్హులు కారు.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది.
Computer Based Test (CBT)
Document Verification (DV)
Medical Examination
CBTలో ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్షను పలు షిఫ్టుల్లో నిర్వహిస్తే మార్కుల సాధారణీకరణ (Normalization) ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఖాళీల సంఖ్యకు 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు
కేటగిరీ ఫీజు CBTకి హాజరైతే రీఫండ్
General / OBC / EWS రూ.500 రూ.400
SC / ST / Ex-SM / PwBD / మహిళలు / Transgender / Minorities / EBC రూ.250 రూ.250
ఫీజును Net Banking, Debit Card, Credit Card లేదా UPI ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. అర్హత ఉన్న అభ్యర్థులకు రీఫండ్ Aadhaar-linked బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది.
RRB Paramedical Recruitmentకు ఎలా అప్లై చేయాలి?
అధికారిక RRB అప్లికేషన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
Create an Accountపై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
గత RRB CENలకు అకౌంట్ ఉంటే అదే అకౌంట్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఒక RRB మాత్రమే ఎంచుకోవాలి.
అందుబాటులో ఉన్న పోస్టులు, జోన్లకు ప్రాధాన్యత క్రమాన్ని ఇవ్వాలి.
లైవ్ ఫోటో, సంతకం, అవసరమైన సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఫారమ్‌ను సబ్మిట్ చేసి అప్లికేషన్ కాపీని భద్రపరచుకోవాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!