Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Games 2026 Young Stars: జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలు 2026 జరగనున్నాయి. ఏషియన్ గేమ్స్ ప్రారంభం కానున్న వేళ ప్రపంచ క్రీడా అభిమానుల దృష్టి జపాన్‌లోని నాగోయా-ఐచిపై పడింది. ఈసారి పలు క్రీడల్లో యువ ప్రతిభావంతులు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న ఆరుగురు యువ క్రీడాకారులు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలపై కన్నేశారు. ఆ యువ ఆటగాళ్లు ఎవరు?, ఏ గేమ్స్ ఆడుతారో ఓసారి చూద్దాం.
యు జిడి (చైనా – స్విమ్మింగ్):
చైనాకు చెందిన యు జిడి స్విమ్మింగ్‌లో అతి చిన్న వయసులోనే సంచలనం సృష్టించింది. 2025 ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో 12 ఏళ్ల వయసులోనే 4×200 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో కాంస్య పతకం సాధించి.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. వ్యక్తిగత విభాగాల్లోనూ ఆమె మూడు ఈవెంట్లలో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాలను చేజార్చుకుంది. ఈ ఏడాది మార్చిలో 200 మీటర్ల బటర్‌ఫ్లైలో అమెరికా ఒలింపిక్ ఛాంపియన్ రెగన్ స్మిత్‌ను ఓడించి తన సామర్థ్యాన్ని నిరూపించింది. ఆసియా క్రీడల్లో 200 మీటర్ల బటర్‌ఫ్లైతో పాటు 200, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలోనూ ఆమె బరిలోకి దిగనుంది. వచ్చే నెలలో 14 ఏళ్లు పూర్తి చేసుకునే యు జిడి ఇప్పటికే ఒలింపిక్ స్వర్ణంపై లక్ష్యాన్ని పెట్టుకుంది.
Also Read
- Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
రుమేష్ తరంగ పతిరాగే (శ్రీలంక – జావెలిన్ త్రో):
జావెలిన్ త్రోలో శ్రీలంకకు చెందిన 23 ఏళ్ల రుమేష్ తరంగ పతిరాగే 2026లో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. డైమండ్ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచిన తొలి శ్రీలంక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. జూన్ 4న రోమ్ డైమండ్ లీగ్‌లో 92.62 మీటర్ల దూరం విసిరి ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. గత నెలలో జ్యూరిచ్‌లో 92.07 మీటర్లు విసరడం ద్వారా 92 మీటర్ల మార్కును రెండుసార్లు దాటిన చరిత్రలో నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఆసియా క్రీడల్లో పతిరాగేకు పాకిస్థాన్ స్టార్ అర్షద్ నదీమ్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. నదీమ్ 92.97 మీటర్లతో ఆసియా రికార్డు కలిగి ఉన్నాడు. అయితే ప్రస్తుతం అతని ఫామ్ ఆశించిన స్థాయిలో లేదు. భారత స్టార్ నీరజ్ చోప్రా గాయం కారణంగా ఈసారి ఆసియా క్రీడల్లో పాల్గొనడం లేదు. దీంతో జావెలిన్‌లో పతిరాగే స్వర్ణానికి ప్రధాన ఫేవరెట్‌గా కనిపిస్తున్నాడు.
షిన్ ఒహాషి (జపాన్ – స్విమ్మింగ్):
జపాన్‌కు చెందిన 17 ఏళ్ల షిన్ ఒహాషి తన దేశ స్విమ్మింగ్‌లో కొత్త తరం స్టార్‌గా ఎదిగాడు. కేవలం 169 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న అతడు జంక్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టపడతానని చెప్పడం విశేషం. అయితే కొలనులో మాత్రం అతని వేగానికి తిరుగులేదు. ఈ ఏడాది 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో చైనా స్టార్ క్విన్ హైయాంగ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డుకు సెకను లోపే దూరంలో నిలిచాడు. ఒక దశలో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే స్థాయిలో కనిపించిన అతని ప్రదర్శనకు జూనియర్ ప్రపంచ రికార్డు కూడా దక్కింది. ఆసియా క్రీడల్లో క్విన్ హైయాంగ్తో మరోసారి తలపడేందుకు ఒహాషి సిద్ధమవుతున్నాడు.
వైభవ్ సూర్యవంశీ (భారత్ – క్రికెట్):
భారత క్రికెట్లో ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ఆసియా క్రీడల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పురుషుల టీ20 క్రికెట్లో ఆసియా క్రీడల టైటిల్‌ను నిలబెట్టుకోవాలని చూస్తున్న భారత్‌కు వైభవ్ కీలక ఆటగాడు. ఐపీఎల్ 2026లో అద్భుత బ్యాటింగ్‌తో 776 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచిన వైభవ్.. ఆ ప్రదర్శనతో ఇంగ్లండ్ పర్యటనకు భారత టీ20 జట్టులో చోటు సంపాదించాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే రెండు అద్భుతమైన సిక్సర్లు బాదాడు. అనంతరం జింబాబ్వేపై కేవలం 18 బంతుల్లోనే తొలి టీ20 అంతర్జాతీయ అర్ధసెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత 49 బంతుల్లో 81 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆసియా క్రీడల్లోనూ వైభవ్ బ్యాట్ నుంచి అలాంటి మెరుపులు చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మిసా నిషియామా (జపాన్ – జిమ్నాస్టిక్స్):
జపాన్‌కు చెందిన 16 ఏళ్ల మిసా నిషియామా సీనియర్ స్థాయిలోకి అడుగుపెట్టిన వెంటనే తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. 2025లో జూనియర్ ఫ్లోర్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె.. ఈ ఏడాది ఏప్రిల్‌లో జపాన్ ఆల్‌రౌండ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. అనంతరం NHK ట్రోఫీలోనూ స్వర్ణ పతకాలు సాధించింది. చిన్నతనంలో బ్రెజిలియన్ జియు-జిట్సుపై ఆసక్తి చూపిన నిషియామా.. ఐదేళ్ల వయసులో జిమ్నాస్టిక్స్ శిక్షణ ప్రారంభించిన తర్వాత ఈ క్రీడపైనే పూర్తిగా దృష్టి పెట్టింది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో మహిళల టీమ్ ఈవెంట్లో జపాన్‌కు పతకం అందించాలన్నది ఆమె లక్ష్యం. 1964 తర్వాత ఈ విభాగంలో జపాన్ పతకం గెలవకపోవడంతో నిషియామాపై భారీ అంచనాలు ఉన్నాయి.
అలెగ్జాండ్రా ఈలా (ఫిలిప్పీన్స్ – టెన్నిస్):
ఫిలిప్పీన్స్‌కు చెందిన అలెగ్జాండ్రా ఈలా టెన్నిస్‌లో ఎదుగుతున్న యువ తారల్లో ఒకరు. ఈ ఏడాది తొలి WTA టైటిల్ గెలవడంతో పాటు వింబుల్డన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇగా స్వియాటెక్‌ను ఓడించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గత నెలలో వాషింగ్టన్ టైటిల్ సాధించే క్రమంలో ప్రపంచ మూడో ర్యాంకర్ జెస్సికా పెగులాను ఫైనల్లో ఓడించింది. అంతకుముందు నవోమీ ఒసాకా, ఎలీనా స్విటోలినా, లేలాహ్ ఫెర్నాండెజ్, జెంగ్ క్విన్వెన్ వంటి ప్రముఖులను కూడా అధిగమించింది. కెరీర్లో అత్యుత్తమంగా 18వ ప్రపంచ ర్యాంకుకు చేరుకున్న ఈలా .. గత ఏడాది జరిగిన హాంగ్జౌ ఆసియా క్రీడల్లో 18 ఏళ్ల వయసులోనే కాంస్య పతకం సాధించింది. సెమీఫైనల్లో జెంగ్ చేతిలో ఓడిన ఆమె.. ఈసారి ఆ అనుభవంతో స్వర్ణం కోసం బరిలోకి దిగనుంది. గత ఏడాది SEA గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఈలా.. ఆసియా క్రీడల్లోనూ బంగారు పతకం సాధించాలని పట్టుదలగా ఉంది.
తాజావార్తలు
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!