CM Chandrababu: దుబాయ్‌ను చూస్తే నాకు అసూయ కలుగుతోంది..
- విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్..
- ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్..
- గత 30 ఏళ్లుగా దుబాయ్ అభివృద్ధిని చూస్తున్నాను..
- దుబాయ్‌ను చూస్తే నాకు అసూయ కలుగుతోంది: చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్ లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను జనవరిలో అబ్దులా బిన్ ను కలిసాను అప్పుడు ముందుగా ఏపీకి రావలని కోరాను.. ఏపీ గురించి మీకు అప్పుడే అర్థమవుతుందని చెప్పా.. ఇచ్చిన మాట ప్రకారం ఆయన తొలుత ఆంధ్రప్రదేశ్ కే వచ్చారని గుర్తు చేశారు. యూఏఈని ఓ దేశంగా చూస్తే ప్రతి దేశానికి కొన్ని అడ్వంటేజ్స్ ఉంటాయి.. దుబాయ్ ప్రాంతంలో 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా.. ఎడారి ఉన్నా ఆ ప్రాంతాన్ని వారు స్వర్గంలా మార్చారు.. అక్కడి అభివృద్ధిని చూశానన్నారు. ఇక, వారు ఇంటర్నెట్ సిటీ పెడితే, నేను హైటెక్ సిటీ కట్టాను.. 2021లో మనం కరోనా వల్ల భయపడ్డాం ఆ సమయంలో యూఏఈ ఇస్టోపియాను తీసుకువచ్చారు అని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
అయితే, ఢిఫరెంట్ గా ఆలోచిస్తే మనం ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 1.1 కోట్ల మంది యూఏఈ జనాభాలో 40 శాతం మంది ఇండియన్స్ ఉన్నారు.. వారి ద్వారా కూడా యూఏఈలో అభివృద్ధి జరుగుతుంది.. మనకు అక్కడ అవకాశాలు వస్తున్నాయి.. ఇండియాను ఎవ్వరు వ్యాపారపరంగా విస్మరించలేరు.. డెమెగ్రఫిక్ డివిడెంట్ కేవలం ఇండియాకు మాత్రమే ఉంది.. చాలా దేశాలు ఏజింగ్ ప్లాబ్లంతో ఇబ్బందులు పడుతున్నారు.. ఇండియాలో రైట్ టైం రైట్ ప్లేస్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు.. 2024-25లో 100 బిలియన్ యూఎస్ డాలర్ల వ్యాపారం యూఏఈకి ఇండియాకు మధ్య జరిగింది అన్నారు. గత పదేళ్లగా 11 స్థానం నుంచి 4వ స్థానానికి భారత్ చేరుకుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: India-Pakistan: అప్పుల కోసం పరుగులు పెడుతోంది.. యూఎన్‌లో పాక్‌పై భారత్ వ్యంగ్యాస్త్రాలు
ఇక, 2047కి ఇండియా ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతుంది.. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. జనవరి 1వ తేదీ నాటికి మొదటి క్వంటం కంప్యూటింగ్ ఏపి నుంచి పని చేస్తుందన్నారు. 575 సర్వీసులు ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇస్తున్నాం.. ఆగష్టు 15 నాటికి ఈ సంఖ్య 100 శాతానికి చేరుతుంది.. మీరు ఇండియాలో పెట్టుబడులు పెడితే అన్ని అనుమతులు ఆన్ లైన్ ద్వారా ఇస్తాం.. మీరు ఏ ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు.. మా హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది.. రాష్ట్రంలో పేదలను పైకి తెచ్చేందుకు పీ4ను తీసుకువచ్చాం.. 100 తం పేదరిక నిర్మూలను మా లక్ష్యం.. దుబాయ్, యూఏఈ ప్రభుత్వాలు ఈ విషయంలో చాలా బాగా చేశారు.. లులూకు ఎంతో డిమాండ్ ఉంది.. ఆయన నన్ను కొచ్చి వచ్చి షాపింగ్ మాల్ చూడాలిని అడిగారు.. విశాఖతో పాటు విజయవాడ, అమరావతిలో కూడా హైపర్ మాల్ పెట్టాలని అడుగుతున్నాను.. సంపద సృష్టిలో పెట్టుబడిదారుల పాత్ర ఎంతో ముఖ్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు