Police search at Vallabhaneni Vamsi house: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.. వంశీ మొబైల్‌లో కీలక ఆధారాలు లభ్యమవుతాయని భావిస్తున్న ఏపీ పోలీసులకు ఓ రకంగా షాక్ తగిలినట్టు అయ్యింది.. హైదరాబాద్‌లోని వల్లభనేని వంశీ మోహన్ ఇంట్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు విజయవాడలోని పటమట పోలీసుల సోదాలు.. దాదాపు రెండు గంటలపాటు వంశీ ఇంట్లో సోదాలు చేశారు పటమట పోలీసులు.. వంశీ ఫోన్ కోసం ఆయన ఇంట్లో విస్తృతంగా గాలించారు.. అయితే, వంశీ ఇంట్లో ఫోన్ లభించకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. కాగా, చివరగా వంశీ ఇంట్లోనే సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ చూపించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. కానీ, అయినా.. ఆయన ఇంట్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించినా వల్లభనేని వంశీ మొబైల్ ఫోన్ లభించలేదు..
Read Also: Hyderabad: ప్రియురాలి పేరెంట్స్ వేధింపులకు ప్రియుడు బలి..
కాగా, గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంట్లో రెండో రోజు కూడా పడమట పోలీసులు సోదాలు నిర్వహించి.. నిరాశతో వెనుదిరిగారు.. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసుల సహాయంతో వంశీ ఇంట్లో తనిఖీలు చేపట్టారు.. మొదటి రోజు సోదాల్లో కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, సీసీ కెమెరా ఫూటేజీని సేకరించారు. వల్లభనేని వంశీ ఇంటికి సంబంధించి గత వారం రోజుల సీసీ టీవీ విజువల్స్ ను ఏపీ పోలీసులు సేకరించారు. ఇక, ఈ రోజు వల్లభనేని వంశీ సెల్‌ఫోన్ కోసం గాలించారు పడమట పీఎస్ పోలీసులు.. అయితే, హైదరాబాద్ లోని వల్లభనేని వంశీ ఇంట్లో సెల్‌ఫోన్ లభించకపోవడంతో పడమట పోలీసులు తిరిగి వెళ్లిపోయారు.. కానీ, వంశీ సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఫోన్ కోసం వంశీ ఇంటిని జల్లెడ పట్టారు. చివరి లొకేషన్ భూజా లొకేషన్ చూపించడంతో ఇంట్లో సోదాలు చేశారు. కాగా, మొన్న హైదరాబాద్ లో వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించిన విషయం విదితమే..