Vijayawada: విషాదం.. హోటల్ కిటికీ నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
- విజయవాడలో విషాదం
- హోటల్ కిటికీ నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి రుహిక మృతి
- గతరాత్రి హోటల్ మినర్వా గ్రాండ్ లో బసచేసిన బద్రీ నాగరాజు కుటుంబం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ కుటుంబానికి తీరని లోటు కలిగింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె మృతి చెందడంతో.. ఆ తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. హాయిగా విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లి తిరిగి వస్తున్న ఆ కుటుంబం… తీవ్ర దు:ఖ సాగరంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే… విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. హోటల్ కిటికీ నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి (రుహిక) మృతి చెందింది. గతరాత్రి బద్రీ నాగరాజు కుటుంబం హోటల్ మినర్వా గ్రాండ్‌లో బసచేసింది. అయితే.. వారు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం కోసమని, విశాఖ నుంచి బయల్దేరి శ్రీశైలం వెళ్లి అక్కడ దేవుడిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో విజయవాడకు వచ్చారు. బెజవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గను దర్శించుకునేందుకు.. హోటల్ మినర్వా గ్రాండ్‌లో దిగారు. అయితే.. ఈరోజు కనక దుర్గ అమ్మవారిని దర్శించుకుని విశాఖ వెళ్లాలనుకుని భావించిన ఆ కుటుంబానికి తీవ్ర విషాదం మిగిలింది.
Read Also: AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లోకి పాత జీవోలు..!
Also Read
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ఈరోజు ఉదయం తన అన్నతో కలిసి దొంగ పోలీస్ ఆట ఆడుతున్న క్రమంలో చిన్నారి రుహిక.. దాక్కోవానికి కిటికీ తలుపు తెరిచింది. ఈ క్రమంలో నాల్గవ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కాలు జారిపడి చిన్నారి మృతి చెందింది. మరో గంటలో హోటల్ రూమ్‌ను చెక్ అవుట్ చేస్తారనే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. తమ కళ్ల ముందే కూతురు చనిపోవడంతో నాగరాజు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. సీఐ ప్రకాష్ మాట్లాడుతూ..
పాప కిటికీలోంచి పడిపోయేటప్పుడు ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారని అన్నారు. వారు హౌస్ కీపింగ్ వర్క్ చేస్తున్నారని తెలిపారు. కాపాడేందుకు పరుగు పరుగున వచ్చినప్పటికీ అప్పటికే పాప కింద పడిపోయిందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!