ప్రజంట్ ఫుల్ ఫామ్ లో ఉంది హీరోయిన్ రష్మిక. బాషతో సంబంధం లేకుండా వరుస విజయాలతో లీడ్ లో ఉంది. ప్రజంట్ బాలీవుడ్ మూవీ ‘చావా’ తో బిజీగా ఉంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే రూ.35 కోట్ల దాకా గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ టాక్. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఈ వారం నెంబర్ వన్ పొజిషన్‌లో ఉండటం టీమ్‌ని సంతోషంలో ముంచెత్తుతోంది. ఒకింత ఇందులో రష్మిక హీరోయిన్ కావడంతో మన ప్రేక్షకుల్లోనూ ఈ మూవీ మీద బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం రష్మిక చాలా కష్ట పడి, ఆరోగ్యం కూడా లెక్కచేయకుండా,వీల్ చైర్‌లో వచ్చి మరి ప్రమోషన్స్ చేస్తోంది. అయితే చాలా చోట్ల అప్పుడప్పుడు కొందరు సెలబ్రెటిలు అనుకోకుండా టంగ్ స్లిప్ అవుతుంటారు. ఒక్కోసారి దాని పరిణామాలు కొంచెం దూరమే వెళ్లొచ్చు. ఇప్పుడు రష్మిక విషయంలో కూడా ఇదే జరిగింది.
Also Read: Fenugreek seeds: మెంతులతో ఆ వ్యాధికి చెక్ పెట్టెయండి..
రీసెంట్ గా ‘చావా’ మూవీ ప్రమోషన్ లో భాగంగా మందన్న మాట్లాడుతూ ‘నేను హైదరాబాద్ నుంచి వచ్చానని, ఇక్కడ అంటే ముంబై లో ఇంత మందిని చూశాక మీ కుటుంబంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. సరిగ్గా ఈ మాట దగ్గర కన్నడ వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రష్మిక స్వరాష్ట్రం కర్ణాటక. తొలి అవకాశం వచ్చింది కూడా కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ లోనే. ఇక దర్శకుడు&నటుడు రక్షిత్ శెట్టితో రష్మిక నిశ్చితార్థం అయ్యాక పెళ్లి వరకు వచ్చి క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. దీంతో గతంలో కూడా తెలుగులో హిట్లు పడ్డాక మాతృభాషను నిర్లక్ష్యం చేస్తోందని రష్మిక పై విమర్శలు కూడా వినిపించాయి. ఇక ఇప్పుడు ముంబైలో అలా మాట్లాడినందుకు ఎక్స్ వేదికగా ట్రిగ్గర్ చేసి ట్వీట్లు పెట్టి మరి ఈ అమ్మడుని నిలదీస్తున్నారు.