KTR : తెలంగాణ రాజకీయాల్లో వేడి మరింత పెరుగుతున్న క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్… ప్రాజెక్టులు, కేసులు, బదిలీలు, నోటీసులు వంటి పలు అంశాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన ఆయన, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు నోటీసుల డ్రామా నడుస్తోందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఏమీలేదని సుప్రీం కోర్టు స్పష్టంగా తెలిపిందని కేటీఆర్ చెప్పారు. అదే విధంగా కాళేశ్వరం గురించి కూడా…
Telangana Govt: సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా శాఖల్లో బదిలీలు చేపట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీస్థాయిలో పోలీసుల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని, సొంత ప్రాంతాలకు ఎవరినీ బదిలీ చేయవద్దని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ కమిషనరేట్ పరిధిలో నలుగురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ క్రాంతిరాణా టాటా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సత్యానందంను పటమట పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అటు కమిషనరేట్‌లో ఉన్న ఎంవీ దుర్గారావును కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పటమట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ రెడ్డిని సిటీ టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి బదిలీ చేశారు. సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న…
ఏపీలో 52 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ అడిషనల్ డీసీపీగా సి.జయరామరాజు, అనంతపురం అడిషనల్ ఎస్పీగా ఇ.నాగేంద్రుడు, తూర్పుగోదావరి అడిషనల్ క్రైమ్ ఎస్పీగా జి.వెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా బి.నాగభూషణ్‌రావు, మెరైన్ అడిషనల్ ఎస్పీగా జీబీఆర్ మధుసూదన్‌రావు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీగా జి.స్వరూపరాణి, అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా వెంకట రామాంజనేయులు, విజిలెన్స్ అండ్…