Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. సింగపూర్ స్థానంలో వియత్నాం వచ్చింది. 2018లో అమరావతిలో స్టార్ట్ ఆప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ ముందుకు రాగా.. గత ప్రభుత్వంలో అమరావతి నిర్మాణం నుంచి వైదొలగింది. గతంలో 1679 ఎకరాల స్టార్ట్ ఆప్ ఏరియా అభివృద్దిపై సింగపూర్ కు సీఆర్డిఏ మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు అమరావతిలో 2 వేల ఎకరాల్లో స్టార్ట్ ఆప్ ఏరియా అభివృద్దికి వియత్నాం ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో వియత్నాం కంపెనీ విన్ గ్రూప్ కంపెనీ సీఈఓ సమావేశం అయ్యారు.
Read Also: CM Revanth Reddy: 2040 వరకు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటా.. రేవంత్ కీలక వ్యాఖ్యలు..
అయితే, అమరావతి స్టార్ట్ ఆప్ ఏరియా అభివృద్ది ప్రతిపాదనలు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు విన్ గ్రూప్ కంపెనీ సీఈఓ ఉంచారు. గతం కంటే మెరుగ్గా స్టార్ట్ ఆప్ ఏరియా అభివృద్దిపై ఏపీ సీఎం ఫోకస్ పెట్టారు. విన్ గ్రూప్ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే సీఆర్డిఏతో ఒప్పందం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపనుంది.