Amaravati Development: రాజధాని అమరావతి అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి సర్కార్.. అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి అభివృద్ధి కోసం అదనపు రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రూ.1,500 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిధులను అమరావతి సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. రుణ…