జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ కులమో చెప్పుకోలేని వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ విమర్శించారు. అప్పుడేమో కాపు అన్నాడని, నిన్న ఏమో బీసీ అంటున్నాడని, చిరంజీవి పార్టీ పెట్టి ఓటమి చెందిన తర్వాత రోజే అన్నను వదిలేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన పదేళ్లలో ఒక్క సర్పంచ్‌ను కూడా గెలిపించుకోలేకపోయారని సెటైర్లు వేశారు.
ALSO READ:Sajjala: ఏపీలో దొంగ ఓట్ల పంచాయతీ.. చంద్రబాబుకు సజ్జల స్ట్రాంగ్ డోస్
జనసేన పనికిమాలిన పార్టీ అని, చంద్రబాబుకు భజన చేసే పార్టీ విరమ్శించారు. ప్యాకేజీకి అమ్ముడుబోయే పార్టీ జనసేన అని ఆరోపించారు. చంద్రబాబుకు ఊడిగం చేసే పార్టీ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ సవాల్ చేసిన విధంగా రాష్ట్రంలో సింగిల్‌గా 175 స్దానాల్లో పోటీ చేసే దమ్ము టీడీపీ లేదా జనసేనకు ఉందా..? అంటూ ప్రశ్నించారు. జగన్ అనే సింహాం సింగిల్‌గా వస్తుందని, 2024 ఎన్నికల్లో 175 సీట్లు వైసీపీ గెలుస్తుందని వెల్లంపల్లి జోస్యం చెప్పారు.పవన్ కళ్యాణ్ పనికిమాలిన వారని, ఎమ్మెల్యేగా గెలవని దద్దమ్మ అంటూ వెల్లంపల్లి విమర్శించారు. రోజుకో మాట, పూటకో వేషం వేసేవారని, ఊసరవల్లికి సరైన పేరు పవన్ కల్యాణ్ అంటూ వెల్లంపల్లి విమర్శించారు.
ALSO READ:YSRCP: వైఎస్ఆర్సీపీకి 13 ఏళ్లు.. ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు