ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు, అక్రమాలు జరుగుతున్నాయంటూ ఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఓటర్లను తొలగించి, దొంగ ఓట్లను నమోదు చేయించిన చరిత్ర చంద్రబాబుదే అని అన్నారు. చంద్రబాబు, ఆయన కరపత్రాలు ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని విమర్శించారు. పాలకుడు ఎలా ఉండకూడదు అనడానికి చంద్రబాబు ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. పాలకుడు ఎలా ఉండాలి అనడానికి వై ఎస్ జగన్ ఉదాహరణ గా నిలిచారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల తాము ఎప్పుడు సానుకూలంగా ఉన్నామన్నారు.
Also Read:Sajjala: వైసీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు
ప్రభుత్వ ఉద్యోగుల వలనే ప్రభుత్వం ఇంత విజయవంతంగా నడుస్తోందన్నారు సజ్జల. ఉపాధ్యాయులు ఆత్మవిశ్వాసంతో పని చేసేలా సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. పక్క రాష్ట్రంలో ఇప్పటి వరకు 40 శాతం జీతాలు ఇవ్వలేదన్నారు. తాము ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా జమ చేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం జీతాలు పెంచిందన్న సజ్జల..చంద్రబాబు దిగే ముందు వరకు 5 డిఏలు బకాయి పెట్టాడరని గుర్తు చేశారు. ఉద్యోగుల సమస్యలపై నిరంతరం తాము చర్చిస్తున్నామని సజ్జల స్పష్టం చేశారు.
Also Read:Viveka Murder Case: అరెస్టు చేసుకోండి.. అన్నింటికి సిద్ధమేనన్న భాస్కర్ రెడ్డి
కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. వైసీపీ నేతలతో పలు చోట్ల ఎన్నికల అధికారులు కుమ్మక్కుతో పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల నమోదు అయ్యాయని అని ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన బోగస్ ఓట్ల వివరాలను లేఖకు జత చేసి పంపించారు. బోగస్ ఓట్ల నమోదులో పాల్గొన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు లేఖలో చంద్రబాబు కోరారు.