Kannappa Vs Kubera : ఈ జూన్ నెలలో రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. రెండూ భారీ బడ్జెట్ సినిమాలే. కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్లు ఉన్నారు. దీనికి వందల కోట్ల బడ్జెట్ అయిందని విష్ణు చెబుతున్నాడు. ఇంకోవైపు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర సినిమాలో నాగార్జున, ధనుష్, రష్మిక ఉన్నారు. వీరు కూడా పెద్ద స్టార్లే. కానీ కన్నప్పతో పోలిస్తే కుబేరలో నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్లు లేరు. రష్మిక ఉన్నా.. ఆమె మెయిన్ లీడ్ కాదు. కానీ కుబేర మూవీ మొదటి నుంచి ఆసక్తి రేపుతూనే ఉంది.
Read Also : Rajamouli : రాజమౌళి మొదటి జీతం ఎంతో తెలుసా..?
శేఖర్ కమ్ముల డైరెక్షన్ పై అందరికీ మంచి నమ్మకం. కంటెంట్, టేకింగ్, మేకింగ్ లో ఆయన కింగ్. టీజర్ నుంచే మూవీ ఆకట్టుకుంది. అందుకే ట్రైలర్ దుమ్ము లేపింది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. 16 గంటల్లోనే 6మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. ట్రైలర్ తో అంచనాలు అమాంతం పెంచేసింది. డబ్బున్న వాడికి, బిచ్చగాడికి మధ్య జరిగే ఘర్షణలను ఇందులో చూపించారు. డైలాగులు, కంటెంట్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. మూవీపై అమాతం హైప్ పెరిగిపోయింది.
అటు కన్నప్ప ట్రైలర్ రెండు రోజుల క్రితమే జూన్ 14న వచ్చింది. రెండు రోజుల్లో కేవలం 4 మిలియన్ల వ్యూస్ వరకే ఆగిపోయింది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి బిగ్ స్టార్లు ఉన్నా అంత తక్కువ వ్యూస్ రావడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. కారణం కంటెంట్, విజువల్స్ ఆశించిన స్థాయిలో లేవనే విమర్శలు. పైగా ఇందులో విష్ణు మెయిన్ లీడ్. సీరియల్స్ తీసిన డైరెక్టర్ మూవీ తీయడం ఇంకో రీజన్. విష్ణు ప్రమోషన్లలో చేస్తున్న కామెంట్లు, మంచు ఫ్యామిలీలో రచ్చ.. ఇవన్నీ కొంత నెగెటివ్ ఇంపాక్ట్ చూపించాయి.
అందుకే ట్రైలర్ కు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ దక్కలేదు. ట్రైలర్ ను చూస్తే చాలా సీన్లు సాదాసీదాగా ఉన్నాయనే కామెంట్లు వచ్చాయి. ప్రభాస్ పాత్ర వరకు బాగానే ఉన్నా.. మిగతా పాత్రలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయని అంటున్నారు నెటిజన్లు. అందుకే ట్రైలర్ తో అమాంతం భారీ అంచనాలు పెంచేస్తామని మూవీ టీమ్ మొదట్లో చెప్పినా.. కొంత వరకే హైప్ వచ్చింది. కుబేర ట్రైలర్ రెస్పాన్స్ తో పోలిస్తే.. కన్నప్పకు ఆ స్థాయిలో రాలేదు. ఒకవేళ కుబేర భారీ హిట్ అయితే కన్నప్ప కలెక్షన్లపై భారీ దెబ్బ పడటం ఖాయం అంటున్నారు.
Read Also : The Rajasaab : ది రాజాసాబ్ పార్ట్-2.. డైరెక్టర్ మారుతి క్లారిటీ..