Anakapalle: హిందువులు పవిత్రంగా భావించే మాసం కార్తీక మాసం. శివునికి ఎంతో ప్రీతీ ప్రదమైన మాసంగా ఈ మాసాన్ని చెప్తారు. ఈ మాసం లో చాల మంది వేకువ జామున నిద్ర లేచి నదీ స్నానాలను ఆచరిస్తారు. అనంతరం గుడిలో దీపాలు వెలిగించి ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఇలా కార్తీక మాసంలో నదీ స్నానాలను ఆచరించి ఉపవాస దీక్షలు ఆచరిస్తే మోక్షం ప్రాప్తిస్తుందని.. కష్టాలు తొలగుతాయని భక్తుల అభిప్రాయం. అయితే అలా కార్తీక మాసం నదీ స్నానాలు చేస్తూ ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
Read also:Congress Cabinet: నల్లేరు మీద నడక కాదు. పల్లేరు కాయలపై పరుగు లాంటింది
వివరాలలోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లా లోని కసింకోట మండలం లోని జోగారావుపేట గ్రామానికి చెందిన నారపురెడ్డి లక్ష్మి, అరట్ల మంగ అనే ఇద్దరు మహిళలు ఈ రోజు కార్తీక సోమవారం సందర్భంగా జోగారావుపేట దగ్గర శారదానదికి నదీ స్నానాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళలతో పాటుగా మరో ఇద్దరు మహిలు కార్తీక మాసం పుణ్య స్నానాల కోసం నది లోకి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఇది గమనించిన స్థానికులు ఆ నలుగురు మహిళల్లో ఇద్దరు మహిళలను రక్షించ గలిగారు. కాగా నారపురెడ్డి లక్ష్మి, అరట్ల మంగ నీటిలో మునిగి మరణించారు. కార్తీక మాస పుణ్య స్నానాలకు వెళ్లి మహిళలు మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.